Health Tips: తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తోందా.? ఇలా చేస్తే అస్సలు నిద్రపోరు..
రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకునే అలవాటు మీకు ఉందా? అయితే, అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Health Tips: తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తోందా.? ఇలా చేస్తే అస్సలు నిద్రపోరు..
Health Tips: చాలామంది రాత్రి పూట ఆఫీసు పనులు ముగించుకుని ఆలస్యంగా ఇంటికి రావడం, ఆకలితో అప్పటికప్పుడు భోజనం చేసి అలసటగా ఉందని వెంటనే నిద్రపోవడం చేస్తుంటారు. అయితే, ఇలా రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతే భవిష్యత్తులో తీవ్రమైన జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 2 నుంచి 3 గంటల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక, గ్యాస్ లేదా ఎసిడిటీ లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి, భోజనం చేసిన తర్వాత కాసేపు 'వజ్రాసనం' వేయడం లేదా కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఇంట్లోనే అటూ ఇటూ వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొట్టలో ఉబ్బసం తగ్గడమే కాకుండా, మనం తిన్న ఆహారం కూడా చాలా సులువుగా అరుగుతుంది.
అంతేకాకుండా, ఛాతిలో మంట, ఎసిడిటీ సమస్య రాకుండా ఉండేందుకు భోజనం చేసిన కాసేపటి తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పూట తీసుకునే డిన్నర్‌లో వీలైనంత వరకు ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే తేలికపాటి పదార్థాలను మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు




