Weight Loss: రోజూ ఓ గ్లాస్ ఈ డ్రింక్ తాగారంటే.. గుట్టలాంటి పొట్ట ఇట్టే కరగాల్సిందే..!

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే రాత్రి పూట భోజనానికి బదులుగా ఏవైనా హెల్తీగా, వేడివేడిగా తాగాలనుకుంటే ఈ రాగి సూప్ బెస్ట్ ఆప్షన్.

Ravi
By Ravi
Updated on: 28 May 2026 4:45 PM IST
Weight Loss
X

Weight Loss: రోజూ ఓ గ్లాస్ ఈ డ్రింక్ తాగారంటే.. గుట్టలాంటి పొట్ట ఇట్టే కరగాల్సిందే..!

Weight Loss: బరువు తగ్గాలనుకున్న చాలామంది రాత్రిపూట డిన్నర్ మానేసి ఏదైనా లైట్ ఫుడ్ లేదా సూప్స్ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన టమాటా, వెజిటేబుల్ సూప్స్ తాగితే బోర్ కొడుతుంది కదా! ఈసారి కాస్త విభిన్నంగా, ఎంతో ఆరోగ్యకరమైన 'రాగి సూప్' ట్రై చేసి చూడండి. మొలకలు వచ్చిన రాగులతో తయారుచేసే ఈ సూప్ ఆరు నెలల పసిపిల్లల నుంచి తొంభై ఏళ్ల వృద్ధుల వరకు ఎవరికైనా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది.

సాధారణ రాగి పిండి కన్నా మొలకెత్తిన రాగుల పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సూప్ కోసం ముందుగా ఒక కేజీ రాగులను శుభ్రంగా కడిగి ఒక రోజంతా నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు వాటిని నీళ్లలో నుంచి తీసి ఒక కాటన్ గుడ్డలో గట్టిగా మూట కట్టి ఎక్కడైనా వేలాడదీయాలి. మూడో రోజుకల్లా వాటికి సన్నని మొలకలు వస్తాయి. ఈ మొలకెత్తిన రాగులను పల్చగా ఎండలో ఆరబోసి, దోరగా వేయించి పొడి చేసుకుని ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు.

ఇక వేడివేడి రాగి సూప్ తయారుచేయడం చాలా సులభం. ఒక వెడల్పాటి పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి ముందుగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఆ తర్వాత మీ అభిరుచిని బట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, బ్రోకలీ లేదా కాలిఫ్లవర్ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ముందుగా సిద్ధం చేసుకున్న మొలకెత్తిన రాగి పిండిని తీసుకుని నీళ్లతో ఉండలు లేకుండా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాన్‌లో నెమ్మదిగా పోస్తూ కలపాలి. ఇది కాసేపటికి సూప్‌లా చిక్కబడుతుంది. మీకు ఇంకొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా వేడినీళ్లు కలుపుకోవచ్చు.

సూప్ చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, అందులో అర టీస్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి. చివరగా సగం నిమ్మచెక్క రసం పిండితే, ఎంతో కమ్మటి వాసనతో వేడివేడి రాగి సూప్ రెడీ అయిపోతుంది. ఇందులో ఉండే ఫైబర్, క్యాల్షియం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రోజూ తినే ఆయిల్ ఫుడ్స్ పక్కనపెట్టి ఈరోజు రాత్రికే ఈ టేస్టీ రాగి సూప్‌ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story