Heatwave: సమ్మర్లో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి
Heatwave: అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్, మే నాటికి ఎండల తీవ్రత మరింత పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో సమ్మర్లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల తప్పులు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Heatwave: సమ్మర్లో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి
Heatwave: అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్, మే నాటికి ఎండల తీవ్రత మరింత పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో సమ్మర్లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల తప్పులు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరు తాగాల్సిందే
హీట్‌వేవ్ సమయంలో చాలా మంది చేసే పెద్ద తప్పు తగినంత నీరు తాగకపోవడం. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో చెమట రూపంలో చాలా నీరు బయటకు వెళ్తుంది. ఆ నీటిని తిరిగి పూడ్చకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీంతో తలనొప్పి, తల తిరగడం, అలసట, దృష్టి కేంద్రీకరణలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. అందుకే రోజంతా తరచుగా నీరు తాగడం చాలా ముఖ్యం.
మధ్యాహ్నపు ఎండలో ఎక్కువసేపు ఉండకండి
వేసవిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువసేపు బయట ఉంటే శరీరంపై వేడి ప్రభావం పెరుగుతుంది. దీంతో వడదెబ్బ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ సమయంలో బయటకు వెళ్లడం తగ్గించాలి. అవసరం అయితే నీడలో ఉండాలి. చల్లని ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవాలి.
సరైన దుస్తులు ధరించాలి
ఎండ కాలంలో మనం వేసుకునే దుస్తులు కూడా శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం చూపుతాయి. బిగుతైన దుస్తులు, ముదురు రంగు ఉండే దస్తులను ధరించకూడదు. ఇవి వేడిని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే వేసవిలో లైట్ కలర్, వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. ఇలా చేస్తే శరీరానికి గాలి సులభంగా చేరి చల్లగా ఉంటుంది.
శరీరం ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి
తీవ్రమైన ఎండలో శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఉదాహరణకు ఎక్కువ చెమట పడటం, కండరాలు పట్టేయడం, వాంతి రావడం, తల తిరగడం. ఇవి శరీరం వేడితో పోరాడుతోందని చెప్పే సంకేతాలు. ఈ లక్షణాలను పట్టించుకోకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారవచ్చు.
కాఫీ, మద్యం తగ్గించి సరైన ఆహారం తీసుకోవాలి
వేసవిలో ఎక్కువగా కాఫీ లేదా మద్యం తీసుకోవడం మంచిది కాదు. ఇవి శరీరంలో నీటి కొరతను ఇంకా పెంచుతాయి. దానికి బదులు నీరు, తాజా పండ్ల రసాలు, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్, మజ్జిగా వంటివి తీసుకోవడం మంచిది. అలాగే ఎండల్లో చాలా మందికి ఆకలి తగ్గుతుంది. కానీ శరీరానికి శక్తి అవసరం ఉంటుంది. అందుకే తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
అన్నింటికంటే ముఖ్యంగా తీవ్రమైన ఎండల్లో పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతారు. అందుకే వారికి తగినంత నీరు, విశ్రాంతి, చల్లని వాతావరణం కల్పించడం చాలా అవసరం.
చిన్న జాగ్రత్తలు తీసుకుంటే హీట్‌వేవ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. వడదెబ్బ తగిలితే కొన్ని సమయాల్లో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.




