Height Increase: జిమ్‌కి వెళ్తే హైట్ పెరుగుతామా.? ఇందులో నిజం ఎంత ఉంది.

Height Increase: చాలా మంది హైట్ పెర‌గాల‌ని కోరుకుంటారు. అయితే ఎత్తు అనేది ఎక్కువ‌గా జీన్స్‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ వ్యాయామం చేసినా హైట్ పెరుగుతామ‌ని కొంద‌రు భావిస్తుంటారు. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Mokshith
Published on: 17 March 2026 2:00 PM IST
Height Increase: జిమ్‌కి వెళ్తే హైట్ పెరుగుతామా.? ఇందులో నిజం ఎంత ఉంది.
X

Height Increase: జిమ్‌కి వెళ్తే హైట్ పెరుగుతామా.? ఇందులో నిజం ఎంత ఉంది.

Height Increase: చాలా మంది హైట్ పెర‌గాల‌ని కోరుకుంటారు. అయితే ఎత్తు అనేది ఎక్కువ‌గా జీన్స్‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ వ్యాయామం చేసినా హైట్ పెరుగుతామ‌ని కొంద‌రు భావిస్తుంటారు. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

జిమ్ చేస్తే నిజంగా హైట్ పెరుగుతామా.?

చాలామందికి ఉన్న సందేహం ఇదే. జిమ్ లేదా వ్యాయామం వల్ల ఎముకల పొడవు నేరుగా పెరగదు. కానీ శరీర పోష్చర్ (నిలువు తీరు) మెరుగుపడుతుంది. వెన్నెముక (స్పైన్) స్ట్రాంగ్ అవుతుంది. శరీరం సూటిగా ఉండటంతో ఎత్తు ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న వయస్సులో వ్యాయామం చేస్తే గ్రోత్ హార్మోన్లు యాక్టివ్ అవుతాయి.

హ్యాంగింగ్ ఎక్సర్‌సైజ్

ఏదైనా బార్‌కు వేలాడటం మంచి వ్యాయామంగా చెప్పొచ్చు. దీనివ‌ల్ల వెన్నెముక స్ట్రెచ్ అవుతుంది. స్పైన్‌పై ఒత్తిడి తగ్గుతుంది, రోజుకు 20–30 సెకండ్లు 3–5 సార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే శరీరం సూటిగా మారుతుంది.

కోబ్రా స్ట్రెచ్ ఆస‌నం

ఇది యోగాలో ఒక ముఖ్యమైన ఆసనం. వెన్నెముక ఫ్లెక్సిబుల్ అవుతుంది. బ్యాక్ మసిల్స్ బలపడతాయి. 15–20 సెకండ్లు హోల్డ్ చేసి 3 సార్లు చేయాలి. ఇది పోష్చర్ మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది.

పెల్విక్ టిల్ట్ (Pelvic Tilt)

ఈ వ్యాయామం లోయర్ బ్యాక్‌కి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో భాగంగా నేలపై పడుకుని మోకాళ్లు మడవాలి. నెమ్మదిగా నడుమును పైకి ఎత్తాలి. కొన్ని సెకండ్లు ఆపి మళ్లీ కిందకు తీసుకురావాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వెన్ను బ‌ల‌ప‌డుతుంది, శరీరం సరిగ్గా నిలబడటానికి సహాయపడుతుంది.

స్కిప్పింగ్

ఇది ఫుల్ బాడీ వర్కౌట్. ఎముకలు బలపడతాయి. శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. రోజుకు 5–10 నిమిషాలు ప్రారంభించి, తర్వాత పెంచాలి. పిల్లలు, టీనేజర్లకు ఇది చాలా ఉపయోగకరం. మొత్తం మీద హైట్ పూర్తిగా పెరగడం జీన్స్‌పై ఆధారపడి ఉన్నా, ఈ వ్యాయామాలు చేస్తే పోష్చర్ మెరుగుపడుతుంది, శరీరం స్ట్రాంగ్ అవుతుంది.

Mokshith

Mokshith

Next Story