Fatty Liver: బరువు తక్కువగా ఉన్నవారిలోనూ ఫ్యాటీ లివర్.. పరిశోధనల్లో సంచలన నిజాలు
Fatty Liver: సాధారణంగా ఫ్యాటీ లివర్ సమస్య కేవలం అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్నవారికే వస్తుందని చాలామంది భావిస్తుంటారు.
Fatty Liver
Fatty Liver: సాధారణంగా ఫ్యాటీ లివర్ సమస్య కేవలం అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్నవారికే వస్తుందని చాలామంది భావిస్తుంటారు. సన్నగా ఉండే వారికి ఈ ప్రమాదం ఉండదని సర్వసాధారణంగా నమ్ముతుంటారు. కానీ, తాజాగా వెలువడిన ఒక కొత్త శాస్త్రీయ అధ్యయనం ఈ అపోహలను పూర్తిగా పటాపంచలు చేసింది. బరువు తక్కువగా లేదా సన్నగా ఉన్నప్పటికీ, రోజువారీ ఆహారంలో ఉప్పును అధికంగా వినియోగించడం వల్ల లివర్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని సైంటిస్టులు గుర్తించారు. సాధారణ లేదా తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నవారిలో కూడా లివర్‌లో కొవ్వు నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేవ్ లివర్ సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఈ స్టడీ స్పష్టం చేస్తోంది.
ఈ అంశంపై సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ అలాగే యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాంటిస్టులు సంయుక్తంగా ఒక ప్రత్యేక పరిశోధన నిర్వహించారు. సాధారణ బరువు లేదా సన్నగా ఉండే వ్యక్తులలో కనిపించే లీన్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పై మొదటిసారిగా వారు ప్రయోగాత్మక నమూనాను అభివృద్ధి చేశారు. ఈ స్టడీలో భాగంగా చూతులకు అధిక ఉప్పు కలిగిన ఆహారాన్ని తినిపించి పరీక్షించారు. శరీరంలో ఎలాంటి స్థూలకాయం లేకపోయినప్పటికీ, ఆహారంలో ఉప్పు మోతాదు పెరిగితే లివర్‌లో వాపులు అలాగే మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
స్థూలకాయం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్‌కు, సన్నగా ఉండేవారిలో ఉప్పు ద్వారా వచ్చే లివర్ సమస్యకు చాలా తేడా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. లావుగా లేకపోయినా కేవలం ఉప్పు మోతాదు ఎక్కువైతే లివర్ జీవక్రియ పూర్తిగా దెబ్బతింటుంది. దీనివల్ల లివర్‌లో తీవ్రమైన వాపులు, కణజాలం దెబ్బతినడం, మచ్చలు పడటం వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. తీవ్రమైన దశలో ఇది లివర్ ఫెయిల్యూర్ స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉంది. అందువల్ల సన్నగా ఉన్నాము కదా అని అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కొనసాగించడం చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మనం రోజూ వంటల్లో వాడే ఉప్పుతో పాటు చిప్స్, నమ్కీన్, ఇతర జంక్ ఫుడ్స్ రూపంలో శరీరంలోకి చేరే హిడెన్ సాల్ట్ కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కేవలం షుగర్ మాత్రమే కాకుండా ఉప్పు కూడా మన శరీరానికి హానికరంగా మారుతోంది. నిపుణుల సూచన ప్రకారం ప్రతి ఒక్కరూ రోజూ ఒక చిన్న చెంచా కంటే తక్కువ ఉప్పును మాత్రమే వినియోగించాలి. అనారోగ్యకరమైన చిరుతిళ్లకు దూరంగా ఉంటూ, సమతుల్యమైన, పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా మాత్రమే లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.




