కుక్కలతో వాకింగ్ చేస్తే చాలు.. నెలకు రూ. 5.72 లక్షల జీతం.. ఎక్కడంటే.?
Pet Care Business: పక్కా ప్లానింగ్ ఉంటే ప్యాషన్‌ను కూడా డబ్బుగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నాడు ఓ టెక్కీ.
కుక్కలతో వాకింగ్ చేస్తే చాలు.. నెలకు రూ. 5.72 లక్షల జీతం.. ఎక్కడంటే.?
Pet Care Business: ఈ రోజుల్లో నెల జీతంతో సరిపెట్టుకోకుండా, అదనపు ఆదాయం కోసం ఏదైనా ఒక సైడ్ బిజినెస్ చేయాలని మనలో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదూ! రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చూసి "ఉద్యోగం చేస్తూ ఇంకేం కొత్తగా చేస్తాంలే, టైమ్ ఎక్కడ ఉంది" అని చాలామంది ఆగిపోతారు. కానీ, న్యూయార్క్‌కు చెందిన 28 ఏళ్ల టెక్కీ కోబీ గుడ్‌హార్ట్ ఆలోచన మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది. మనం రోజూ ఆఫీసులకు వెళ్లి, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే వచ్చే జీతం కంటే, అతను కేవలం కుక్కలను వాకింగ్‌కి తీసుకెళ్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించినా, ఇది అక్షరాలా నిజం!
అసలు ఈ కుర్రాడి కథేమిటంటే.. కోబీ గుడ్‌హార్ట్ న్యూయార్క్ నగరంలో ఒక ఫుల్ టైమ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మంచి జీతం తీసుకుంటున్నాడు. అతనికి జంతువులంటే, ముఖ్యంగా కుక్కలంటే ప్రాణం. ఆ ఇష్టంతోనే 2025లో 'గుడ్‌హార్ట్ డాగ్ కో.' అనే ప్రీమియం పెట్ కేర్ సర్వీస్‌ను ప్రారంభించాడు. సాధారణంగా న్యూయార్క్ లాంటి పెద్ద నగరాల్లో జనాలకు ఏమాత్రం ఖాళీ ఉండదు. ఎప్పుడూ ఆఫీస్ పనులతో, టెన్షన్లతో బిజీగా ఉండే అక్కడి వాసులకు, తమ పెంపుడు కుక్కలను చూసుకునే సమయం దొరకదు. సరిగ్గా ఈ పాయింట్‌నే కోబీ తన బిజినెస్ మోడల్‌గా మార్చుకున్నాడు. తన ఇంజనీరింగ్ ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా తన సమయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఉదయం ఆఫీస్‌కు వెళ్లే ముందు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో, సాయంత్రం, అలాగే వీకెండ్స్‌లో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తుంటాడు. మధ్యాహ్నం వేళ పని ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడానికి ఒక సహాయకుడిని కూడా పనిలోకి తీసుకున్నాడు. అలా రోజూ సుమారు 10 నుంచి 20 కుక్కలను వాకింగ్‌కి తీసుకెళ్తారు.
కేవలం ఈ కుక్కల వాకింగ్ బిజినెస్ ద్వారా కోబీ ఇప్పుడు నెలకు ఏకంగా 6,000 డాలర్లు (అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 5.72 లక్షలు) సంపాదిస్తున్నాడు. ఇది తన ఉద్యోగం ద్వారా వచ్చే జీతానికి అదనం! ఎటువంటి భారీ ప్రకటనలు లేకుండా, కేవలం మౌత్ టాక్, సోషల్ మీడియా ద్వారానే ఇతనికి కస్టమర్లు విపరీతంగా పెరుగుతున్నారు.
డబ్బు సంపాదించడం కోసం ఏవేవో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని, మనకిష్టమైన పనిని కరెక్ట్ టైమ్‌లో, సరైన ప్రదేశంలో చేస్తే అదే ఒక పెద్ద బిజినెస్ అవుతుందని కోబీ స్టోరీ మనకు స్పష్టంగా చెబుతోంది.




