Cooking Oil: వంట నూనెను ఒకసారి ఓపెన్ చేశాక ఎన్ని రోజులు వాడొచ్చు.! సంచలన నిజాలు..

Cooking Oil: ఒకసారి ఓపెన్ చేసిన వంటనూనెను ఎన్ని రోజులలోపు వాడాలో మీకు తెలుసా? ఆక్సిడేషన్ వల్ల నూనె ఎలా విషపూరితంగా మారుతుందో తెలుసా..

Ravi
By Ravi
Published on: 30 May 2026 3:15 PM IST
Cooking Oil
X

Cooking Oil: వంట నూనెను ఒకసారి ఓపెన్ చేశాక ఎన్ని రోజులు వాడొచ్చు.! సంచలన నిజాలు..

Cooking Oil: మన భారతీయ వంటకాల్లో నూనె లేకపోతే ఏది జరగదు. తాలింపు పెట్టాలన్నా, పకోడీలు వేయాలన్నా నూనె లేనిదే వంట పూర్తి కాదు. మధ్యతరగతి ఇళ్లలో చాలామంది మార్కెట్ నుంచి తెచ్చిన వంటనూనె డబ్బా లేదా ప్యాకెట్ ఎప్పుడు కొన్నామో కూడా మర్చిపోయి, ఖాళీ అయ్యే వరకు వాడుతూనే ఉంటారు. కానీ, ఒకసారి ఓపెన్ చేసిన వంటనూనెను ఎన్ని రోజులు వాడాలి? దానిని ఎలా భద్రపరచాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఒకసారి వంటనూనె ప్యాకెట్ లేదా బాటిల్‌ను ఓపెన్ చేసిన తర్వాత 6 నుంచి 12 నెలల లోపే దానిని పూర్తిగా వాడేయడం ఎంతో మంచిది. ఆ సమయం దాటితే, గాలిలోని ఆక్సిజన్ కారణంగా నూనెలో 'ఆక్సిడేషన్' అనే రసాయన ప్రక్రియ జరుగుతుంది. దీనివల్ల నూనెలో ఉండే సహజమైన పోషకాలన్నీ నశించడమే కాకుండా, అది నాణ్యత కోల్పోయి ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంది. అందుకే పాత నూనెను వాడే ముందు కాస్త జాగ్రత్తగా పరిశీలించాలి.

ఒకవేళ వంటనూనె రంగు మారినా, పట్టుకుంటే జిగటగా అనిపించినా, లేదా దాని నుంచి ఒక రకమైన వింత వాసన వస్తున్నా ఆ నూనెను అస్సలు ఉపయోగించకూడదు. రంగు, వాసన లేదా స్వభావంలో మార్పు వచ్చిన నూనెను వాడటం వల్ల ఎసిడిటీ, తీవ్రమైన కడుపునొప్పి రావడమే కాకుండా, దీర్ఘకాలంలో గుండెజబ్బులు లాంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే, నూనె డబ్బాలను వంటగదిలో నేరుగా ఎండ తగిలే చోట లేదా స్టవ్ పక్కన ఉంచకూడదు. వంటనూనెను ఎప్పుడూ లైట్ పడని, చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచడం వల్ల అది ఎక్కువ రోజులు పాడవ్వకుండా ఉంటుంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story