Health Tips: వర్షాకాలంలో ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి.. ఇక ఆస్పత్రి ఖర్చులు మిగిలినట్టే..

Health Tips: వర్షాకాలంలో తరచుగా వేధించే జలుబు, జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి.

Ravi
By Ravi
Published on: 14 Jun 2026 11:50 AM IST
Health Tips
X

Health Tips: వర్షాకాలంలో ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి.. ఇక ఆస్పత్రి ఖర్చులు మిగిలినట్టే..

Health Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాతావరణం చల్లబడటంతో పాటు జలుబు, జ్వరాలు, ఇన్ఫెక్షన్ల లాంటి అనేక ఆరోగ్య సమస్యలు మన దరిచేరుతాయి. ఈ సీజన్‌లో వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో తగిన రోగనిరోధక శక్తి ఉండటం ఎంతో అవసరం. వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి అనే అంశాలపై వైద్యులు ఏమన్నారంటే.?

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం:

విటమిన్-సి: రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్-సికి మించినది లేదు. కాబట్టి ఈ విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఔషధ గుణాలున్న వస్తువులు: మీ రోజువారీ డైట్‌లో అల్లం, వెల్లుల్లి, పసుపు లాంటివి తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. ఇవి సహజసిద్ధమైన యాంటీబయాటిక్స్‌గా పనిచేసి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.

ఆకుకూరలకు బదులు కూరగాయలు: వర్షాకాలంలో ఆకుకూరలకు పురుగులు పట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో వాటికి కాస్త దూరంగా ఉండి, బాగా ఉడికించిన కూరగాయలను మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ప్రోబయోటిక్స్: జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది. దీనికోసం యోగర్ట్, మజ్జిగ లాంటి ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవాలి.

తప్పక పాటించాల్సిన ఇతర జాగ్రత్తలు:

కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా, ఈ సీజన్‌లో ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండాలంటే కొన్ని కనీస జాగ్రత్తలు పాటించాలి. ప్రతిరోజూ కనీసం 7 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర అవసరం. వర్షాకాలంలో నీటి ద్వారా అనేక రోగాలు వ్యాపిస్తాయి కాబట్టి, ఎప్పుడూ కాచి చల్లార్చిన నీటినే తాగాలి. దోమలు, సూక్ష్మక్రిములు దరిచేరకుండా మన చుట్టూ ఉండే పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story