Ant Home Remedies :వంటింట్లో చీమల రచ్చకు ఇలా చెక్ పెట్టండి!

Ant Home Remedies: వేసవిలో చీమల దండయాత్రతో విసిగిపోయారా? వంటింట్లో చక్కెర డబ్బా నుంచి మంచం వరకు చేరి ఇబ్బంది పెడుతున్న చీమలను వెనిగర్, బేకింగ్ సోడా వంటి ఇంటి వస్తువులతోనే ఎలా తరిమికొట్టాలో ఈ స్టోరీలో చూడండి.

Ganesh
Published on: 29 March 2026 2:53 PM IST
How to Get Rid of Ants Naturally
X

How to Get Rid of Ants Naturally

Ant Home Remedies: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఇంట్లో ఎక్కడ చూసినా చీమల వరుసలు కనిపిస్తుంటాయి. కేవలం తీపి పదార్థాలకే పరిమితం కాకుండా బట్టలు, సోఫాలు, చివరకు మంచంపైకి కూడా ఇవి చేరుతుంటాయి. చీమలు కుట్టినప్పుడు వాటిలోని ఫార్మిక్ యాసిడ్ వల్ల చర్మంపై దద్దుర్లు, తీవ్రమైన దురద వస్తాయి. మరి ఈ వేసవిలో చీమల బెడద నుంచి మీ ఇంటిని, ఇంట్లో వాళ్లను ఎలా కాపాడుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చీమలను తరిమికొట్టే చిట్కాలు ఇవే..

* చీమలను వదిలించుకోవడానికి వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. తెల్ల వెనిగర్, సాధారణ నీటిని సమానంగా తీసుకొని కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో నింపండి. చీమలు తిరిగే దారుల్లో దీనిని చల్లండి. రోజువారీ ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి తుడిస్తే చీమలు మీ దరికి కూడా రావు.

* చీమలు ఎక్కువగా వచ్చే రంధ్రాల వద్ద ఎర్ర మిరప పొడి లేదా నల్ల మిరియాల పొడిని చల్లండి. మిరియాల పొడిని నీటిలో కలిపి స్ప్రే చేసినా మంచి ఫలితం ఉంటుంది. అయితే, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈ పొడులు వారి కళ్లలో పడకుండా జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోకండి.

* సమాన పాళ్లలో పొడి చక్కెర, బేకింగ్ సోడాను కలిపి చీమలు వచ్చే ప్రదేశాల్లో చల్లండి. చక్కెర వాసనకు చీమలు ఆకర్షితమవుతాయి, కానీ అందులోని బేకింగ్ సోడా వాటి కడుపులోకి వెళ్లగానే రసాయనిక చర్య జరిగి చీమలు చనిపోతాయి.

* మనం గిన్నెలు కడగడానికి వాడే లిక్విడ్ సోప్‌ను నీటిలో కలిపి చీమల దారుల్లో చల్లడం వల్ల వాటి వాసన గ్రహించే శక్తి దెబ్బతింటుంది. దీనివల్ల అవి అయోమయానికి గురై ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోతాయి.

ఈ జాగ్రత్తలు పాటించండి..

పాలు, జ్యూస్ లేదా తినుబండారాలు కింద పడగానే వెంటనే తుడిచేయాలని అప్పుడు చీమలు రావడం తగ్గుతుంది. అలాగే గోడల మధ్య లేదా తలుపుల సందుల్లో ఉన్న పగుళ్లను సిమెంట్ లేదా పుట్టీతో మూసివేయడం ద్వారా చీమలు లోపలికి రాకుండా చూడవచ్చు. చీమలు చల్లదనం కోసం తేమ ఉన్న ప్రదేశాలకు చేరుతుంటాయి. కాబట్టి వంటింట్లో సింక్ దగ్గర లేదా బాత్‌రూమ్ బయట నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే లక్ష్మణ రేఖలు వాడకుండానే మీ ఇంట్లోకి చీమలు రాకుండా చేసుకోవచ్చు

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story