Health Tips: కేజీ బరువు తగ్గాలంటే ఎన్ని కేలరీలు కరిగించాలో తెలుసా? నిపుణుల లెక్కలు ఇవే!
Health Tips: శరీర బరువును ఒక కేజీ తగ్గించుకోవాలంటే సుమారు 7,700 కేలరీలను కరిగించాలని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారపు అలవాట్లు, నడక ద్వారా బరువు ఎలా తగ్గవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
Health Tips: కేజీ బరువు తగ్గాలంటే ఎన్ని కేలరీలు కరిగించాలో తెలుసా? నిపుణుల లెక్కలు ఇవే!
Health Tips: ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో అధిక బరువు ఒకటి. బరువు తగ్గాలని ప్రణాళిక వేసుకునే వారు ముందుగా శరీరంలో ఉండే కేలరీల లెక్కలను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం, మన శరీరం బరువు ఒక కేజీ తగ్గాలంటే సుమారు 7,700 కేలరీలను కరిగించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కేవలం ఒక్క వారంలోనే కేజీ బరువు తగ్గాలని టార్గెట్ పెట్టుకుంటే, వారు రోజువారీగా సుమారు 1,100 కేలరీలను ఖర్చు చేయవలసి ఉంటుందని వివరిస్తున్నారు. ఇది సాధారణ వ్యాయామాలతో సాధ్యం కావడం కొంచెం కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు.
సాధారణంగా ప్రతి వెయ్యి అడుగుల నడకకు సుమారు 40 నుంచి 50 కేలరీలు మాత్రమే బర్న్ అవుతాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు 1,100 కేలరీలు కరిగించాలంటే ప్రతిరోజూ దాదాపు 22,000 నుంచి 27,500 స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి అతిగా శ్రమించడం వల్ల కీళ్లపై విపరీతమైన ఒత్తిడి పెరిగి తీవ్రమైన మజిల్ పెయిన్ వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కేవలం వ్యాయామంపైనే కాకుండా తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు.
కాగా, ఈ సమస్యకు పరిష్కారంగా డైలీ తీసుకునే ఫుడ్ నుంచి దాదాపు 500 కేలరీలను తగ్గించుకుంటూ, రోజువారీ నడకను 12,000 నుంచి 15,000 అడుగులకు పరిమితం చేయడం చాలా బెటర్ అని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆహారంలో తగిన మార్పులు చేసుకుంటూ క్రమపద్ధతిలో నడవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా సురక్షితంగా బరువు తగ్గవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని ఆరోగ్య నిపుణులు మరోసారి గుర్తు చేస్తున్నారు.




