How to reduce stress naturally: చిన్న అలవాట్లతో ఒత్తిడిని ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు...
How to reduce stress naturally: ప్రస్తుత కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి.
How to reduce stress naturally
How to reduce stress naturally: ప్రస్తుత కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి. ఇది కేవలం మనసుకే కాదు, శరీరానికి కూడా చేటు చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు, నిద్రలేమికి ఒత్తిడే ప్రధాన కారణం. దీని నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఒత్తిడిని జయించవచ్చని చెబుతున్నారు నిపుణులు.
శ్వాసపై ధ్యాస.. అద్భుతమైన చికిత్స
హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం రోజుకు కనీసం 10 నిమిషాలపాటు ప్రశాంతంగా కూర్చొని లోతైన శ్వాస తీసుకోవడం వలన నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. హృదయస్పందన రేటు తగ్గించి మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది. డీప్ బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా కోపం, కంగారు వంటి వాటిని అదుపులో ఉంచుకోవచ్చు.
ప్రకృతి ఒడిలో.. కార్టిసాల్‌కు చెక్
ప్రస్తుతం మనం కాంక్రిట్ గదుల మధ్యన నివశిస్తున్నాం. కాంక్రిట్ జంగిల్‌లో నివశించే మనకు సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రకృతిలో కాసేపు సేదతీరాలి. పార్కులోని పచ్చని చెట్ల మధ్య నడవడం వలన శరీరంలో కార్డిసాల్ స్థాయిలు తగ్గుతాయి. వారంలో కనీసం మూడునాలుగు సార్లు ప్రకృతితో మమేకం కావడం వలన మానసిక ఒత్తిడి మెరుగుపడుతుంది.
డిజిటల్ డిటాక్స్.. స్క్రీన్లకు సెలవు
అన్నింటికంటే భయంకరమైనది స్క్రీన్ స్ట్రెస్. మొబైల్, లాప్‌టాప్ వాడకం వలన ఈ స్ట్రెస్ కలుగుతుంది. నిద్రపోయే గంట ముందు ఫోన్ లేదా లాప్‌టాప్ పక్కనపెట్టాలి. రాత్రిపూట 7 నుంచి 8 గంటల గాఢ నిద్రలేకుంటే శరీరం అలసటకు గురై ఒత్తిడి పెరుగుతుంది. క్రమబద్దమైన నిద్రను అలవాటుగా మార్చుకుంటే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.
ఇష్టమైన పనిలో నిమగ్నం
ఇంట్లో ఖాళీగా కూర్చుంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి. అందుకే ఇంట్లో ఉండకుండా మీకు ఇష్టమైన పనులు చేసే అవకాటు చేసుకోవాలి. అంటే పెయింటింగ్, సంగీతం లేదా ఇతర పనుల్లో నిమగ్నం కావాలి. ఇలా చేయడం వలన తెలియని సంతృప్తి కలుగుతుంది. ఒత్తిడి అనిపిస్తే ఇష్టమైన వారితో కాసేపు మాట్లాడితే ఒత్తిడి దూరం అవుతుంది. సోషల్ సపోర్ట్ అనేది ఒత్తిడిని ఎదుర్కొనే గొప్ప ఆయుధం అని చెప్పాలి.
ఆలోచనలను నియంత్రించినపుడే ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. ఆలోచనలకు కళ్లెం వేయాలి. ఒత్తిడికి మూలమైన మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటే చాలు...ఒత్తిడి నుంచి సులభంగా బయటపడొచ్చు.




