Lifestyle: మధ్యాహ్నం నిద్ర పోతే మంచిదేనా.? ఏమైనా సమస్యలుంటాయా.?
Lifestyle: చాలామందికి భోజనం చేసిన తర్వాత కాసేపు కునుకు తీయడం సహజ అలవాటు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిదా, కాదా అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Lifestyle: మధ్యాహ్నం నిద్ర పోతే మంచిదేనా.? ఏమైనా సమస్యలుంటాయా.?
Lifestyle: చాలామందికి భోజనం చేసిన తర్వాత కాసేపు కునుకు తీయడం సహజ అలవాటు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిదా, కాదా అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న కునుకు మంచిదే
మధ్యాహ్నం 20–30 నిమిషాల పాటు తీసుకునే చిన్న నిద్ర శరీరానికి, మెదడుకు మంచి రిలాక్స్ ఇస్తుంది. ఇది ఒక రీఛార్జ్లా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏకాగ్రత పెరుగుతుంది, పనితీరు మెరుగవుతుంది, అలసట తగ్గుతుంది. రాత్రి సరైన నిద్ర లేని వారు లేదా శారీరకంగా ఎక్కువగా పనిచేసే వారికి ఇది చాలా ఉపయోగకరం.
మానసిక ప్రశాంతతకు సహాయం
చిన్న కునుకు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. స్ట్రెస్ తగ్గి, మిగతా రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కార్యాలయాల్లో పనిచేసేవారికి ఇది మూడ్ను కూడా మెరుగుపరుస్తుంది.
ఎక్కువ నిద్ర మాత్రం మంచిది కాదు
మధ్యాహ్నం ఒక గంటకు మించి నిద్రపోతే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు నిద్రపోతే లేచిన తర్వాత తలనొప్పి రావచ్చు, శరీరం బరువుగా అనిపిస్తుంది, బద్ధకం పెరుగుతుంది, దీంతో రోజువారీ పనుల్లో ఆలస్యం జరుగుతుంది.
రాత్రి నిద్రపై ప్రభావం
మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోతే రాత్రిపూట నిద్ర పట్టడం కష్టమవుతుంది. ఇది మీ నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తుంది. అలవాటుగా మారితే. రాత్రి నిద్ర నాణ్యత తగ్గుతుంది, ఉదయం లేవడం కష్టమవుతుంది, జీవక్రియలో మార్పులు వస్తాయి, దీంతో ఆరోగ్య సమస్యలు రావచ్చు.
ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన నియమాలు
మధ్యాహ్నం నిద్రపోవాలనుకుంటే కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం. 20–40 నిమిషాలకే పరిమితం అవ్వాలి, ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి, రాత్రి పడుకునే ముందు మొబైల్, టీవీ వాడకం తగ్గించాలి, తేలికపాటి ఆహారం తీసుకోవాలి, కెఫీన్ వినియోగం తగ్గించాలి.
నోట్: ఈ వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలే ప్రాణామికంగా పాటించాలి.




