Relationship: భార్యాభర్తల మధ్య గొడవలా? ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి.. మీ బంధం పదిలంగా ఉంటుంది!
Relationship: భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు. వివాహ బంధం బలపడాలంటే గొడవ సమయంలో ఏయే విషయాలకు దూరంగా ఉండాలో తెలుసుకోండి.
Relationship: భార్యాభర్తల మధ్య గొడవలా? ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి.. మీ బంధం పదిలంగా ఉంటుంది!
Relationship News: వివాహం తర్వాత కొత్త వాతావరణం, అలవాట్ల వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం మామూలే. కానీ, చిన్న గొడవలను పెద్దవిగా మార్చుకుంటే అది బంధం విచ్ఛిన్నం కావడానికి దారితీస్తుంది. ముఖ్యంగా భర్తతో గొడవ జరిగినప్పుడు భార్య కొన్ని విషయాల్లో సంయమనం పాటించడం చాలా అవసరం.
గొడవ సమయంలో చేయకూడని పనులు:
గొడవ జరుగుతున్నప్పుడు పాత విషయాలను, గతంలో చేసిన తప్పులను గుర్తు చేయడం వల్ల కోపం రెట్టింపవుతుంది. ఇది సమస్యను పరిష్కరించకపోగా, గొడవను మరింత పెంచుతుంది.
ఒకరి తల్లిదండ్రులపై లేదా బంధువులపై విమర్శలు చేసుకోవడం అతిపెద్ద తప్పు. మీరు భర్త కుటుంబ సభ్యులను విమర్శిస్తే, ఆయన మీ వారిపై విరుచుకుపడే అవకాశం ఉంది. ఇది ఇద్దరి మధ్య అగాధాన్ని పెంచుతుంది.
గొడవ జరిగిన వెంటనే రాజీ పడాలని ప్రయత్నించకండి. ఆ సమయంలో ఇద్దరిలోనూ ఆవేశం ఉంటుంది. కొంత సమయం ఒంటరిగా వదిలేస్తే, మనసు ప్రశాంతపడి ఆలోచనలో మార్పు వస్తుంది.
సమస్యను పరిష్కరించుకోవడానికి చిట్కాలు:
గొడవ సద్దుమణిగిన తర్వాత కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోండి. మాటలతో రెచ్చగొట్టకుండా సమస్య ఎక్కడ వచ్చిందో చర్చించండి.
తప్పు మీ వైపు ఉన్నప్పుడు 'సారీ' చెప్పడానికి వెనుకాడకండి. క్షమాపణ అడగడం వల్ల మీరు తక్కువ కారు, పైగా అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది.
అవతలి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉండటం వల్ల గొడవ త్వరగా ముగిసే అవకాశం ఉంటుంది.




