Food: జంక్ ఫుడ్ అర్థాన్ని మార్చేస్తున్న మెక్‌డొనాల్డ్స్.. అందుబాటులోకి కొత్త మెనూ!
Food: ఫాస్ట్‌ఫుడ్ అంటే చాలామందికి ఇష్టం. అయితే బయట తినే ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండాలి, కార్బోహైడ్రేట్లు, షుగర్ తక్కువగా ఉండాలని కోరుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.
Food: జంక్ ఫుడ్ అర్థాన్ని మార్చేస్తున్న మెక్‌డొనాల్డ్స్.. అందుబాటులోకి కొత్త మెనూ!
Food: ఫాస్ట్‌ఫుడ్ అంటే చాలామందికి ఇష్టం. అయితే బయట తినే ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండాలి, కార్బోహైడ్రేట్లు, షుగర్ తక్కువగా ఉండాలని కోరుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా తమ ఆహారం, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు ఇలాంటి ఆప్షన్ల కోసం చూస్తున్నారు. ఈ మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ తన మెనూలో కొత్త రకాల ఆహారాలను చేర్చే దిశగా అడుగులు వేస్తోంది.
హై ప్రొటీన్ ఫుడ్‌పై దృష్టి
ప్రస్తుతం చాలామంది తక్కువ కార్బ్స్, తక్కువ షుగర్, ఎక్కువ ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా GLP-1 తరహా మందులు ఉపయోగిస్తున్న వారిలో ఆకలి తగ్గడంతో తక్కువ పరిమాణంలోనే ఎక్కువ పోషకాలు అందించే ఆహారానికి డిమాండ్ పెరిగింది. దీంతో ఫాస్ట్‌ఫుడ్ తినాలనుకునే హెల్త్ కాన్షియస్ కస్టమర్లను కూడా ఆకర్షించేలా మెక్‌డొనాల్డ్స్ కొత్త ఆప్షన్లను పరిశీలిస్తోంది.
కొత్తగా ఏం తీసుకురానుంది?
కొత్త మెనూలో భాగంగా కొన్ని ఆహార పదార్థాలను మెక్‌డొనాల్డ్స్ ఇప్పటికే పరీక్షిస్తున్నట్లు సమాచారం. వీటిలో బర్గర్ బౌల్, గ్రిల్డ్ చికెన్ స్నాక్ ర్యాప్, ఎగ్ బైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా బర్గర్ బౌల్‌లో సాధారణ బర్గర్‌లో ఉండే బ్రెడ్ ఉండదు. దీంతో కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మరో ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. గ్రిల్డ్ చికెన్, ఎగ్ బైట్స్ వంటి వాటితో ప్రొటీన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సంస్థ చూస్తోంది.
కొత్త మెనూ ఎప్పటి నుంచి రానుంది.?
ప్రస్తుతం ఇవి టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. కస్టమర్ల నుంచి వచ్చే స్పందన, ఆహారానికి లభించే ఆదరణ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. అందువల్ల కొత్త మెనూను ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అన్ని ఆప్షన్లు ఒకేసారి అందుబాటులోకి వస్తాయని కూడా చెప్పలేం.
సాధారణ ఫాస్ట్‌ఫుడ్‌తో పాటు కొత్త ఆప్షన్లు
మెక్‌డొనాల్డ్స్ మెనూలో సాధారణంగా బర్గర్లు, ఫ్రైస్ వంటి ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే కస్టమర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి కూడా నచ్చే ఆహారాన్ని అందించాలని సంస్థ భావిస్తోంది. కొత్త హై ప్రొటీన్, తక్కువ కార్బ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తే ఫాస్ట్‌ఫుడ్ తినాలనుకునే వారిలో ఆరోగ్యకరమైన ఎంపిక కోసం చూస్తున్న వారికి మరో అవకాశం లభించనుంది.




