Tea: టీ తాగితే పళ్లు పచ్చగా మారుతాయా? శాస్త్రవేత్తలు చెబుతున్న షాకింగ్ నిజాలు!

Tea: టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయనే భయం ఇక వద్దు. పాలు కలిపిన టీ (Milk Tea) తాగడం వల్ల దంతాలు మరింత మెరుస్తాయని అల్బెర్టా విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Arun Chilukuri
Published on: 20 Jun 2026 3:42 PM IST
Tea
X

Tea: టీ తాగితే పళ్లు పచ్చగా మారుతాయా? శాస్త్రవేత్తలు చెబుతున్న షాకింగ్ నిజాలు!

Tea: "నిద్రవచ్చేస్తోంది.. ఒక కప్పు టీ తాగుదాం", "తలనొప్పిగా ఉంది.. కొంచెం టీ తాగండి".. నిత్యం మన ఇళ్లలో, ఆఫీసుల్లో వినిపించే మాటలివి. నీటి తర్వాత ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పానీయం టీ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, రెగ్యులర్‌గా టీ తాగే వారిని వేధించే ప్రధాన సమస్య.. దంతాలు పసుపు రంగులోకి మారడం. కానీ, టీని పాలతో కలిపి (Milk Tea) తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారే ప్రమాదం తప్పడమే కాకుండా, అవి మరింత మెరుస్తాయని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది.

'అల్బెర్టా స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీ' విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డెంటల్ నిపుణులు డాక్టర్ ఎవా చౌ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన వివరాలు 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెంటల్ హైజీన్'లో ప్రచురితమయ్యాయి. కేవలం బ్లాక్ టీ తాగడం వల్ల దంతాలపై పసుపు రంగు మరకలు పడుతున్నాయని, అదే టీలో పాలు కలిపి తాగినప్పుడు పళ్లపై పడిన మరకలు శుభ్రం కావడానికి సహాయపడుతుందని వారు కనుగొన్నారు.

పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మనిషి దంతాలను మిల్క్ టీ, మరియు పాలు లేని నార్మల్ టీలో 24 గంటల పాటు ఉంచి పరీక్షించారు. ఈ ప్రయోగంలో మిల్క్ టీలో ఉంచిన దంతాల మెరుపు గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు.

బ్లీచింగ్‌లా పనిచేస్తుంది: పాలలో ఉండే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ దంతాలను పసుపు మరకల బారిన పడకుండా రక్షిస్తుంది. టీలో పాలు కలపడం వల్ల అది దంతాలపై ఒక నాచురల్ బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. మార్కెట్‌లో దంతాలు మెరవడానికి దొరికే కొన్ని రకాల టూత్‌పేస్ట్‌ల కంటే కూడా మిల్క్ టీ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని డాక్టర్ ఎవా చౌ స్పష్టం చేశారు.

అతిగా తాగితే ముప్పే.. రోజుకు ఎన్ని కప్పులు సేఫ్?

టీ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానిని అతిగా సేవించడం వల్ల అన్ని అనర్థాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజుకు రెండు లేదా మూడు కప్పుల టీ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు.

కానీ, అంతకంటే ఎక్కువ కప్పుల టీ తాగితే అది నేరుగా మానవ జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

విపరీతంగా టీ తాగడం వల్ల తీవ్రమైన నిద్రలేమి (Insomnia) సమస్య తలెత్తుతుంది.

వైద్య శాస్త్రం ప్రకారం.. దీర్ఘకాలిక నిద్రలేమి సమస్య భవిష్యత్తులో జ్ఞాపకశక్తిని కోల్పోయే 'అల్జీమర్స్' వ్యాధికి దారితీసే ప్రమాదం ఉంది.

కాబట్టి, టీపై ఎంత ఇష్టం ఉన్నప్పటికీ ఆరోగ్య దృష్ట్యా రోజుకు 2-3 కప్పులకు మించి తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story