Mouthwash: మౌత్‌వాష్ ఎక్కువ‌గా వాడుతున్నారా.? ర‌క్త‌పోటు వ‌చ్చే ప్ర‌మాదం

Mouthwash: నోటి శుభ్రత కోసం మౌత్‌వాష్‌ను ఉప‌యోగిస్తుంటాం. నోటి దుర్వాసన తగ్గించడానికి, శుభ్రంగా ఉంచుకోవడానికి దీనిని తరచూ ఉపయోగిస్తున్నారు. కానీ వైద్యులు చెబుతున్నది ఏమిటంటే, మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

Mokshith
Published on: 24 April 2026 3:29 PM IST
Mouthwash
X

Mouthwash

Mouthwash: నోటి శుభ్రత కోసం మౌత్‌వాష్‌ను ఉప‌యోగిస్తుంటాం. నోటి దుర్వాసన తగ్గించడానికి, శుభ్రంగా ఉంచుకోవడానికి దీనిని తరచూ ఉపయోగిస్తున్నారు. కానీ వైద్యులు చెబుతున్నది ఏమిటంటే, మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

నోటిలో ఉన్న మంచి బ్యాక్టీరియా ప్రాముఖ్య‌త‌

మన నోటిలో ఉన్న అన్ని బ్యాక్టీరియా చెడ్డవి కావు. కొన్ని మంచి బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఇవి మనం తినే ఆహారంలో ఉన్న నైట్రేట్‌ను నైట్రైట్‌గా మార్చుతాయి. ఆ తర్వాత అది నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి శరీరంలో రక్త ప్రసరణను సరిగా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది బీపీ నియంత్రణకు చాలా ముఖ్యమైనది.

మౌత్‌వాష్ వల్ల వచ్చే సమస్య ఏమిటి?

ఎక్కువగా యాంటీబ్యాక్టీరియల్ ఉన్న‌ మౌత్‌వాష్ వాడితే, నోటిలో ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తాయి. దీంతో నైట్రేట్.. నైట్రైట్ మార్పు ప్రక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి తగ్గిపోతుంది. దీని వల్ల రక్తనాళాలు సరిగ్గా పని చేయకపోవచ్చు, బీపీ పెరిగే అవకాశం ఉంటుంది.

పరిశోధనలు ఏమంటున్నాయి?

కొన్ని అధ్యయనాల ప్రకారం, యాంటీబ్యాక్టీరియల్ మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడితే నోటిలోని మంచి బ్యాక్టీరియా 90% వరకు తగ్గిపోవచ్చు. కొద్దిరోజుల ఉపయోగంతోనే లాలాజలంలో నైట్రేట్ స్థాయి తగ్గడం గ‌మ‌నించారు. దీంతో కొంతమందిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ కొద్దిగా పెరిగినట్లు గుర్తించారు.

ఎలా వాడాలి? డాక్టర్ల సూచనలు

రోజుకు రెండు సార్లకు మించి మౌత్‌వాష్ వాడటం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీన్ని అలవాటుగా కాకుండా అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. ముఖ్యంగా గమ్ సమస్యలు, డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత మాత్రమే ఉపయోగించాలి. రోజువారీ నోటి శుభ్రత కోసం బ్రషింగ్, ఫ్లాసింగ్ వంటి పద్ధతులను ప్రధానంగా పాటించడం ఆరోగ్యకరం.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story