Niacin Supplements: వైరల్ నియాసిన్ సప్లిమెంట్స్‌: లాభమా, ప్రమాదమా?

Niacin Supplements: "ఇప్పుడు సోషల్ మీడియాలో నియాసిన్ చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఇన్ఫ్లుయెన్సర్లు దీన్ని చర్మం మెరుగుపరచడానికి, వయసు తగ్గించడానికి ఉపయోగపడుతుందంటూ ప్రమోట్ చేస్తున్నారు.

Srinivas Rao
Published on: 4 April 2026 7:28 PM IST
Niacin Supplements: వైరల్ నియాసిన్ సప్లిమెంట్స్‌: లాభమా, ప్రమాదమా?
X

Niacin Supplements: "ఇప్పుడు సోషల్ మీడియాలో నియాసిన్ చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఇన్ఫ్లుయెన్సర్లు దీన్ని చర్మం మెరుగుపరచడానికి, వయసు తగ్గించడానికి ఉపయోగపడుతుందంటూ ప్రమోట్ చేస్తున్నారు. అయితే, అధిక మోతాదు తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదం కావచ్చని, ఫ్లషింగ్‌, లివర్ సమస్యలు, గుండె సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు."

సోషల్‌ మీడియాలో నియాసిన్ (విటమిన్ B3) ఇప్పుడు చర్మం అందంగా ఉండటానికి, వయసు తగ్గించటానికి “మిరాకిల్ సప్లిమెంట్‌గా ప్రాచుర్యం పొందింది. యువత, సీనియర్స్‌ అందరూ దీన్ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే, తగు జాగ్రత్తలు పాటించకుండా తీసుకుంటే ఇది ఫ్లషింగ్‌, లివర్ సమస్యలు, గుండె సమస్యలు, మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో అంతరాయం కలిగించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నియాసిన్ అంటే ఏమిటి?

నియాసిన్ లేదా విటమిన్ B3, శరీరానికి అత్యవసరమైన నీటిలో కరిగే విటమిన్. ఇది శరీరంలో మెటాబాలిజాన్ని సక్రియంగా ఉంచటంలో, DNA మరమ్మత్తులో, సెల్యులర్ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

" నియాసిన్ రెండు రకాలుగా ఉంటుంది: నికోటినిక్ యాసిడ్ మరియు నయాసినమైడ్‌. న్యూఢిల్లీ లోని ఎలాంటిస్ హెల్త్‌కేర్ డాక్టర్ చందని జైన్ గుప్తా వివరించారు:"

“నియాసిన్ కొలెస్ట్రాల్‌ను తగ్గించగలదు, కానీ ఫ్లషింగ్‌, చర్మం వేడెక్కడం, తలనొప్పి వంటి సమస్యలు కలగజేస్తుంది. నయాసినమైడ్‌ చర్మానికి మంచిది, ఫ్లషింగ్‌ తక్కువ, చర్మ రక్షణ, బేరియర్ పునరుద్ధరణలో ఉపయోగకరంగా ఉంటుంది.”

చర్మం మెరుగుదలకు, వయస్సు తగ్గింపుకు ఉపయోగమా?

వైరల్ టిప్స్‌లో నయాసిన్‌ ఇప్పుడు యాంటీ-ఎజింగ్ సప్లిమెంట్‌గా ప్రచారం పొందుతున్నా, దీని ప్రభావాలు శాస్త్రీయంగా నిర్ధారితంగా లేవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా, పెద్దవారి రోజువారీ విటమిన్ B3 అవసరం 14–16 మి.గ్రా., ఇది సరైన ఆహారపు అలవాట్ల ద్వారా సులభంగా అందుతుంది. కానీ మార్కెట్లో ఎక్కువ మోతాదులో ఉన్న సప్లిమెంట్స్‌ తీసుకుంటే ఫ్లషింగ్‌, మలబద్ధకం, తలనొప్పి, లివర్ సమస్యలు, గుండె రేటు అస్థిరత వంటి సమస్యలు రావచ్చు.

దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొంతమందిలో గుండె, మధుమేహం, గౌట్‌, మసిల్స్ నష్టం వంటి సమస్యలకు గురవుతున్నారు. వైద్యుల ప్రకారం, చర్మం మెరుగుదలకు, వయసు తగ్గించడానికి నియాసిన్ సప్లిమెంట్స్‌కు ఆధారపూర్వక శాస్త్రీయ సాక్ష్యం లేదు; ఈ ప్రయోజనాలు సాధారణ ఆహారపు విటమిన్ల ద్వారా మాత్రమే సాధ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు..

విటమిన్లు ఎల్లప్పుడూ సురక్షితం కాదు

విటమిన్ ఎల్లప్పుడూ సురక్షితం అని చాలామంది ఆలోచిస్తారు,” కానీ ఇది పొరపాటు అని డాక్టర్ గుప్తా వివరించారు. విటమిన్లు కూడా మితిమీరితే విషపూరిత ప్రభావాలను చూపుతాయని, నయాసిన్‌ అధిక మోతాదులో జాగ్రత్త లేకుండా తీసుకోవడం ప్రమాదకరం అని డాక్టర్ తెలిపారు. కొన్ని చికిత్సలలో మాత్రమే ఇది సురక్షితం అని చెప్పారు.

సురక్షితంగా ఎలా వాడాలి?

1. డాక్టర్ సూచన లేకుండా అధిక మోతాదు తీసుకోవద్దు.

2. లివర్, గుండె, మధుమేహ సమస్యలు ఉన్నవారు ముందుగా వైద్యులను సంప్రదించాలి.

3. ప్రారంభంలో తక్కువ మోతాదు, ఆ తర్వాత మితిమీరకుండా మాత్రమే పెంచాలి.

4. తీసుకుంటున్న సమయంలో ఫ్లషింగ్‌, మలబద్ధకం, తలనొప్పి లాంటి లక్షణాలను పర్యవేక్షించండి.

5. గుర్తింపు ఉన్న, నాణ్యత సర్టిఫైడ్ ఉత్పత్తులను మాత్రమే వాడాలి.

వైరల్ హెల్త్‌ ట్రెండ్స్‌ ఎప్పుడూ అనుసరించకూడదు. సప్లిమెంట్స్‌ తీసుకునే ముందు వైద్యుల సూచనలు తీసుకోవడం, ఆహారపు మోతాదు సరిచూసుకోవడం, మరియు ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం అత్యంత అవసరం.

Srinivas Rao

Srinivas Rao

Next Story