Women Beaches: ఈ బీచ్‌లు కేవలం మహిళలకే.. అక్కడ ఏం చేస్తారో తెలుసా..?

Women Beaches: మహిళల భద్రత, ఏకాంతమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని అద్భుతమైన బీచ్‌లు పనిచేస్తున్నాయి.

Naresh.k
Published on: 20 April 2026 10:47 AM IST
Women Beaches
X

Women Beaches

Best Women Beaches: అందమైన సముద్ర తీరం.. అలల హోరు.. చల్లని గాలి.. ఎవరూ ఇబ్బంది పెట్టకుండా స్వేచ్ఛగా విహరించాలని ఏ మహిళకు ఉండదు చెప్పండి? కానీ సాధారణ బీచ్‌లలో రద్దీ, భద్రత, ప్రైవసీ వంటి కారణాల వల్ల చాలా మంది మహిళలు పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతుంటారు. కానీ మహిళల భద్రత, స్వేచ్ఛ , ఏకాంతానికి పెద్దపీట వేస్తూ కొన్ని దేశాలు వినూత్నమైన బీచ్‌లను నిర్వహిస్తున్నాయి. ఇక్కడ మహిళలు తమకు నచ్చిన దుస్తుల్లో, ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఈత కొట్టవచ్చు, యోగా చేయవచ్చు లేదా సరదాగా ఆటపాటల్లో మునిగిపోవచ్చు. పురుషులకు ప్రవేశం లేని ఆ బీచ్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

లా ఫెమ్ బీచ్, ఈజిప్ట్

ఈజిప్టులోని అలెగ్జాండ్రియా సమీపంలో ఉన్న ఈ బీచ్ ఒక మినీ స్వర్గంలా ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ నుంచి నిర్వాహకుల వరకు అందరూ మహిళలే.లోపలికి వెళ్లేటప్పుడే కెమెరాలను సీజ్ చేస్తారు, కాబట్టి ప్రైవసీకి డోకా లేదు.ఇక్కడ జుంబా, యోగా, బెల్లీ డాన్స్ వంటివి నిత్యం జరుగుతుంటాయి. ఎనిమిదేళ్ల లోపు అబ్బాయిలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు.

అంటాల్యా బీచ్, టర్కీ

టర్కీలోని అంటాల్యా మెట్రోపాలిటన్ మున్సిపాలిటీ ఈ బీచ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుపుతోంది. ఇక్కడ కేవలం బీచ్ మాత్రమే కాదు.. స్పా, టర్కిష్ బాత్, హెయిర్ సెలూన్ , పేస్ట్రీ షాపులు కూడా ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 7:30 వరకు ఇది పూర్తిగా మహిళలకే సొంతం. ఆ తర్వాత అందరికీ అనుమతి ఉంటుంది.

సూపర్‌షీ ఐలాండ్, ఫిన్లాండ్

ఒత్తిడి లేని ప్రపంచాన్ని అనుభవించాలనుకునే మహిళల కోసం ఇదొక డిటాక్స్ కేంద్రం. బాల్టిక్ సముద్రంలోని ఈ ప్రైవేట్ ద్వీపంలో పురుషులకు అసలు తావే లేదు. ఇక్కడికి వెళ్లాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు.. అప్లికేషన్ పెట్టుకుని, ఇంటర్వ్యూలో పాస్ అయితేనే ఎంట్రీ దొరుకుతుంది. యోగా, మెడిటేషన్ చేస్తూ ప్రకృతి ఒడిలో గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

అల్ మమ్జర్ కార్నిష్, దుబాయ్

దుబాయ్‌లో మహిళల కోసమే ప్రత్యేకంగా నిర్మించిన మొదటి పబ్లిక్ బీచ్ ఇది.చుట్టూ ఫెన్సింగ్ ఉండటం వల్ల బయటి ప్రపంచానికి లోపల ఏం జరుగుతుందో తెలియదు. నైట్ స్విమ్మింగ్ , ఫిట్‌నెస్ సెషన్లు ఇక్కడ చాలా పాపులర్.

గోవాలోని స్పెషల్ జోన్లు

మన దేశంలో కూడా మహిళల ప్రైవసీ కోసం అడుగులు పడుతున్నాయి. గోవాలోని ప్రసిద్ధ బీచ్‌లైన అరంబోల్, కలంగుట్ వంటి చోట్ల 2025 నుంచి ప్రత్యేక స్విమ్మింగ్ జోన్లను ఏర్పాటు చేశారు.మహిళలపై వేధింపులు తగ్గించడానికి , సోలో ఫిమేల్ ట్రావెలర్లకు భరోసా ఇవ్వడానికి ఈ వినూత్న ప్రయత్నం మొదలైంది.

లోకమంతా తిరిగి చూడాలనుకునే సాహసవంతులైన మహిళలకు ఈ బీచ్‌లు ఒక వరం లాంటివి. ఎటువంటి అభద్రతా భావం లేకుండా, మనసులోని భావాలను స్వేచ్ఛగా పంచుకుంటూ, అలల మీద విహరించాలనుకుంటే ఈ ప్రాంతాలను తప్పక సందర్శించాల్సిందే.

Naresh.k

Naresh.k

Next Story