2 రోజులు.. జస్ట్ 2 కప్పులు చాలు.. గుండె జబ్బులు రమ్మన్నా రావంతే..!

Oats benefits for cholesterol: మెటబాలిజం అంటే మన శరీరంలోని జీవక్రియ. జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే నాలుగు ప్రధాన ఆరోగ్య సమస్యల కలయికనే 'మెటబాలిక్ సిండ్రోమ్' అంటారు.

Venkat
Published on: 28 May 2026 6:15 PM IST
Oats benefits for cholesterol
X

2 రోజులు.. జస్ట్ 2 కప్పులు చాలు.. గుండె జబ్బులు రమ్మన్నా రావంతే..!

Oats benefits for cholesterol: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు అధిక కొలెస్ట్రాల్, మెటబాలిక్ సిండ్రోమ్. పూర్వం విదేశాలకే పరిమితమైన ఓట్స్ (Oats) సంస్కృతి, గత 15 ఏళ్లుగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా పెరిగింది. ఉదయాన్నే పాలల్లో ఓట్స్ వేసుకుని తాగడం ఒక హెల్తీ ట్రెండ్‌గా మారిపోయింది. అయితే, ఓట్స్ కేవలం ఒక బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ మాత్రమే కాదు.. శరీరంలో పేరుకుపోయే చెడ్డ కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి, గుండె జబ్బులను నివారించడానికి ఒక అద్భుతమైన ఔషధం.

మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

మెటబాలిజం అంటే మన శరీరంలోని జీవక్రియ. జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే నాలుగు ప్రధాన ఆరోగ్య సమస్యల కలయికనే 'మెటబాలిక్ సిండ్రోమ్' అంటారు. అవి:

ఊబకాయం (Obesity)

అధిక రక్తపోటు (High BP)

మధుమేహం (Diabetes)

అధిక కొలెస్ట్రాల్ (High Cholesterol)

ఈ నాలుగింటిలో కేవలం ఒకటి ఉంటే దాన్ని సిండ్రోమ్ అనరు. కానీ ఈ నాలుగు జబ్బులు కలిసి ఒకే వ్యక్తిని వేధిస్తుంటే, దానిని మెటబాలిక్ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు.

ప్రేగుల్లోని "మంచి బ్యాక్టీరియా"కు ఓట్స్ ఎలా మేలు చేస్తాయి?

మిగిలిన తృణధాన్యాలతో (Millets) పోలిస్తే ఓట్స్‌లో అత్యధికంగా 14% నుంచి 15% వరకు పీచు పదార్థం (Fiber) ఉంటుంది. వారంలో కేవలం రెండు రోజులు రెండు కప్పుల ఓట్స్ తిన్నా, అందులోని ఫైబర్ మన ప్రేగుల్లోకి చేరి, అక్కడ ఉండే లాభదాయకమైన "గుడ్ బ్యాక్టీరియా"కు ఎరువులా పనిచేస్తుంది.

ఈ మంచి బ్యాక్టీరియా ఓట్స్ ఫైబర్‌ను ఆహారంగా తీసుకుని శరీరాన్ని రక్షించే మూడు రకాల ముఖ్యమైన ఆమ్లాలను (Acids) విడుదల చేస్తుంది.

ఎసిటేట్ (Acetate)

బ్యూటిరేట్ (Butyrate)

ప్రోపియోనేట్ (Propionate)

ఈ ఆమ్లాలు రక్తంలోకి ప్రవేశించి కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ లెవెల్స్‌ను అద్భుతంగా అదుపు చేస్తాయి. జర్మనీలోని 'బాన్ యూనివర్సిటీ' (University of Bonn) శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, వారంలో కేవలం రెండు రోజులు ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎల్‌డీఎల్ (LDL) అనే చెడ్డ కొలెస్ట్రాల్ దాదాపు 10% వరకు తగ్గుతుందని, దాని ప్రభావం నెలన్నర రోజుల పాటు ఉంటుందని రుజువైంది.

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

ఓట్స్‌లో ఉండే అధిక ఫైబర్ వల్ల మనం తిన్న ఆహారం నుండి గ్లూకోజ్ (చక్కెర) రక్తంలోకి ఒకేసారి కాకుండా చాలా నెమ్మదిగా విడుదలవుతుంది. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. అంతేకాకుండా, రక్తనాళాల గోడలలో వచ్చే ఇన్ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించి, కొవ్వు పేరుకుపోకుండా గుండెను రక్షిస్తుంది.

ఓట్స్‌ను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?

ఓట్స్‌ను బోరింగ్ ఫుడ్‌లా కాకుండా మనకు నచ్చిన విధంగా రుచికరంగా వండుకోవచ్చు..

ఓట్స్‌ను నీటిలో లేదా పాలల్లో మెత్తగా ఉడికించి అన్నంలా తినవచ్చు.

కూరగాయలు ముక్కలు వేసి కమ్మని ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు.

ఓట్స్‌ను కాస్త నానబెట్టి, తాజా ఫ్రూట్ సలాడ్స్‌పై చల్లుకుని కూడా తీసుకోవచ్చు.

సమకాలీన ప్రపంచంలో చాలా మందిని వేధిస్తున్న జంట జబ్బులైన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌లకు ఓట్స్ ఒక అద్భుతమైన ప్రకృతి సిద్ధమైన పరిష్కారం. వారంలో కనీసం రెండు సార్లు ఓట్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మెటబాలిక్ సిండ్రోమ్ ముప్పు నుంచి తప్పించుకోవడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవచ్చు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story