Polio: పోలియో డ్రాప్స్‌పై 4 అపోహలు.. అసలు నిజాలు ఇవే.! పూర్తి వివరాలు
Polio: పోలియో డ్రాప్స్ గురించి ప్రజల్లో ఇంకా ఎన్నో అపోహలు ఉన్నాయి. పోలియో పూర్తిగా అంతరించిపోయిందని, ఇది కేవలం పిల్లలకే వస్తుందని చాలామంది భావిస్తుంటారు.
Polio: పోలియో డ్రాప్స్‌పై 4 అపోహలు.. అసలు నిజాలు ఇవే.! పూర్తి వివరాలు
Polio: పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం క్రమం తప్పకుండా పోలియో డ్రాప్స్ వేయాలని సూచిస్తోంది. అయితే పోలియో వ్యాక్సిన్, వ్యాధి గురించి ప్రజల్లో ఇంకా పలు అపోహలు నెలకొన్నాయి. వాటి వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ప్రజల్లో ఉన్న ముఖ్యమైన 4 అపోహలు, వాటి నిజాలు ఇవే.
అపోహ 1: పోలియో పూర్తిగా అంతరించిపోయింది, కాబట్టి టీకా అవసరం లేదు.
నిజం: ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో పోలియో తగ్గుముఖం పట్టినా, ఇంకా కొన్ని దేశాల్లో పోలియో వైరస్ ఉనికిలో ఉంది. కాబట్టి జాగ్రత్త కోసం టీకా తప్పనిసరి.
అపోహ 2: పోలియో పిల్లలకే వస్తుంది.
నిజం: ఇది కేవలం పిల్లలకే పరిమితం కాదు. టీకా వేయించుకోని పెద్దలకు కూడా పోలియో వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
అపోహ 3: పోలియో వ్యాక్సిన్ సురక్షితం కాదు.
నిజం: ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని ఆరోగ్య సంస్థలు పదేపదే స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
అపోహ 4: పోలియో అంటే పక్షవాతం మాత్రమే.
నిజం: పోలియో సోకిన చాలా మందిలో స్వల్ప జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి వంటి సాధారణ లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. కేవలం కొద్దిమందిలో మాత్రమే పక్షవాతం వస్తుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం అపోహలు వీడి, ఐదేళ్లలోపు చిన్నారులందరికీ విధిగా పోలియో డ్రాప్స్ వేయించడం మనందరి బాధ్యత.




