Ragi Side Effects: రాగి ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం చాలా డేంజర్ సుమా.?
Ragi Side Effects: చలికాలం వచ్చిందంటే చాలామంది తమ ఆహారంలో రాగిని చేర్చుకుంటారు. రాగి పిండి రొట్టెలు, సంగటి, దోశలు, జావ వంటి వంటకాలను ఇష్టంగా తింటారు.
Ragi Side Effects: రాగి ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం చాలా డేంజర్ సుమా.?
Ragi Side Effects: చలికాలం వచ్చిందంటే చాలామంది తమ ఆహారంలో రాగిని చేర్చుకుంటారు. రాగి పిండి రొట్టెలు, సంగటి, దోశలు, జావ వంటి వంటకాలను ఇష్టంగా తింటారు. ఇందులో కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. అయితే రాగి అందరికీ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
IBS-D సమస్య ఉన్నవారు రాగికి దూరంగా ఉండాలి
రాగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. సాధారణంగా ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే IBS-D (Irritable Bowel Syndrome with Diarrhea) సమస్య ఉన్నవారికి రాగి ఇబ్బందులు కలిగించవచ్చు. ఈ సమస్యతో బాధపడేవారిలో తరచూ విరేచనాలు, కడుపునొప్పి, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాగిలో ఉండే అధిక ఫైబర్ కొందరిలో ఈ సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా తరచూ విరేచనాలు లేదా లూజ్ మోషన్స్ అవుతున్నవారు రాగిని తినకుండా ఉండటం మంచిది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే వైద్యులు లేదా డైటీషియన్ సలహా తీసుకోవాలి.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు జాగ్రత్త
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు రాగిని తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఉన్నవారు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రాగిలో కాల్షియం అధికంగా ఉంటుంది. అయితే కాల్షియం ఎక్కువగా ఉందని మాత్రమే రాగి కిడ్నీలో రాళ్లకు కారణమవుతుందని చెప్పలేం. రాళ్ల రకం, శరీరంలోని ఆక్సలేట్ స్థాయులు, నీరు తాగే అలవాట్లు వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా తరచూ ఈ సమస్య ఎదుర్కొనేవారు రోజువారీ ఆహారంలో రాగిని చేర్చుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవచ్చా?
థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా రాగి తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని పోషకాహార నిపుణురాలు శ్వేతా షా సూచిస్తున్నారు. అయితే థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరూ రాగిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వారి థైరాయిడ్ సమస్య రకం, తీవ్రత, తీసుకుంటున్న మందులు, మొత్తం ఆహారపు అలవాట్లను బట్టి రాగి తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారు రాగిని రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.
రాగిలో ఉండే పోషకాలు
రాగిని పోషకాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యంగా పరిగణిస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సమాచారం ప్రకారం.. 100 గ్రాముల రాగిలో సుమారు 7.3 గ్రాముల ప్రోటీన్, 3.6 గ్రాముల ముడి ఫైబర్, 19.1 గ్రాముల మొత్తం డైటరీ ఫైబర్ ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, ఇతర ఖనిజాలు, విటమిన్లు, మొక్కల నుంచి లభించే పోషక సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు తోడ్పడతాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.




