Rose Plant Care Tips: గులాబీ మొక్క ఎండిపోతోందా? ఈ చిట్కాలతో పూల జల్లు ఖాయం!

Rose Plant Care Tips: నర్సరీ నుండి తెచ్చిన గులాబీ మొక్కలు ఎండిపోతున్నాయా? మీ మొక్కలను కాపాడుకుని, గుత్తులుగా పూలు పూయించే అద్భుతమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.

veeru
Published on: 29 April 2026 6:30 AM IST
Rose Plant Care Tips
X

Rose Plant Care Tips: గులాబీ మొక్క ఎండిపోతోందా? ఈ చిట్కాలతో పూల జల్లు ఖాయం!

Rose Plant Care Tips: చాలామంది ఎంతో ఇష్టంగా నర్సరీ నుంచి గులాబీ మొక్కలను తెచ్చుకుంటారు. కానీ, కుండీలో నాటిన రెండు మూడు రోజులకే అవి ఎండిపోవడం చూసి నిరాశ చెందుతుంటారు. సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. మీ ఇంట్లోని గులాబీ మొక్క ఏపుగా పెరిగి, నిండుగా పూలు పూయాలంటే ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి.

ఎండిన కొమ్మలను కత్తిరించండి

ముందుగా మొక్కను నిశితంగా పరిశీలించాలి. ఎండిపోయిన కొమ్మలు, ఆకులతో పాటు నల్లగా మారిన భాగాలను పదునైన కత్తెరతో తొలగించాలి. కత్తిరించిన భాగం వద్ద ఇన్ఫెక్షన్లు సోకకుండా పసుపు లేదా ఫంగిసైడ్‌ రాయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల త్వరగా కొత్త చిగుర్లు వస్తాయి.

ఎండ మరియు గాలి:

గులాబీ మొక్కకు సూర్యరశ్మి చాలా అవసరం.

రోజుకు కనీసం 6 గంటల పాటు ఎండ తగిలే చోట కుండీలను ఉంచాలి.

♦ వారానికి ఒకసారి కుండీలోని మట్టిని పైపైన తవ్వుతూ ఉండాలి. దీనివల్ల వేళ్లకు గాలి తగిలి మొక్క బలంగా పెరుగుతుంది.

పోషకాలు అందించండి:

మొక్క ఎదుగుదల మట్టిలోని పోషకాలపై ఆధారపడి ఉంటుంది.

♦ నెలకోసారి పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు అందించండి.

♦ మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి కానీ, నీరు నిల్వ ఉండి బురదలా మారకుండా జాగ్రత్త పడాలి.

చిట్కా: ఇంట్లో వాడేసిన టీ పొడిని కడిగి మట్టిలో కలపండి. అలాగే కోడిగుడ్డు పెంకులను పొడి చేసి వేయడం వల్ల మొక్కకు కావలసిన కాల్షియం పుష్కలంగా అందుతుంది.

నాటడంలో మెళకువలు:

గులాబీ మొక్కను నేలలో నాటినట్లయితే, దాని చుట్టుపక్కల మరే ఇతర మొక్కలు లేకుండా చూడండి. కొమ్మలు స్వేచ్ఛగా వ్యాపించడానికి తగినంత ఖాళీ స్థలం ఉండటం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.

veeru

veeru

Next Story