Facts: కొత్త దుస్తులు వేసుకునే ముందు ఈ తప్పు చేస్తున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే
Facts: చాలా మంది కొత్త దుస్తులు కొనుగోలు చేయగానే వేసుకుంటారు. అయితే ఇలా కొనుగోలు చేసిన వెంటనే వేసుకోవడం మంచిదేనా అంటే కాదని చెబుతున్నారు నిపుణులు .
Facts: కొత్త దుస్తులు వేసుకునే ముందు ఈ తప్పు చేస్తున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే
Facts: చాలా మంది కొత్త దుస్తులు కొనుగోలు చేయగానే వేసుకుంటారు. అయితే ఇలా కొనుగోలు చేసిన వెంటనే వేసుకోవడం మంచిదేనా అంటే కాదని చెబుతున్నారు నిపుణులు . ఇంతకీ కొత్త దుస్తులు వేసుకునే ముందు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త బట్టలు ఎందుకు ఉతికి వేసుకోవాలి.?
బట్టలు తయారు చేసే సమయంలో వాటిపై రంగులు, ఫినిషింగ్ కెమికల్స్, ఇతర ట్రీట్మెంట్లు వేస్తారు. వీటి వల్ల బట్టలు రవాణా సమయంలో లేదా షాపులో డిస్‌ప్లేలో మంచి ఆకారంలో కనిపిస్తాయి. అయితే ఈ కెమికల్స్ దుస్తులు కొనుగోలు చేసిన తర్వాత కూడా వాటిపై ఉండే అవకాశం ఉంది. అందుకే మొదటిసారి వేసుకునే ముందు కడగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
దుమ్ము, బ్యాక్టీరియా ఉండే ప్రమాదం
దుస్తులు ఫ్యాక్టరీ నుంచి గోదాములు, అక్కడి నుంచి షాపులకు చేరే వరకు చాలా చోట్ల నిల్వలో ఉంటాయి. ఈ సమయంలో వాటిపై దుమ్ము, సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉంటుంది. అంతేకాదు, షాపుల్లో చాలామంది ఆ బట్టలను ట్రై చేస్తుంటారు. దీంతో వాటిపై బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కొత్త బట్టలు వేసుకునే ముందు కడగడం ఆరోగ్యానికి మంచిది.
రసాయనాల వల్ల చర్మ సమస్యలు
కొన్ని నివేదికల ప్రకారం బట్టల తయారీలో ఫార్మాల్డిహైడ్ వంటి కెమికల్స్ ఉపయోగిస్తారు. ఇది దుస్తులు ముడుచుకోకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలాగే స్టార్చ్ కూడా వేస్తారు, దీని వల్ల బట్టలు గట్టిగా ఉండి మంచి ఆకారంలో కనిపిస్తాయి. కానీ ఇవి కొంతమందికి చర్మంపై అలర్జీ, దురద, కాలుతున్నట్టు అనిపించడం వంటి సమస్యలు కలిగించవచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్యలు ఎక్కువగా రావచ్చు.
బట్టల ఫిట్, సౌకర్యం కూడా మెరుగవుతుంది
బట్టలను ఫ్యాక్టరీలో తయారు చేసే సమయంలో వాటిని బాగా లాగి, టైట్‌గా ఉంచి తయారు చేస్తారు. అందుకే అవి అసలు ఆకారంలో ఉండకపోవచ్చు. మొదటిసారి కడిగిన తర్వాత బట్టలు సహజమైన ఆకారంలోకి వస్తాయి. దీంతో అవి ధరించడానికి మరింత సౌకర్యంగా ఉంటాయి. ముఖ్యంగా కాటన్ బట్టలు మొదటిసారి కడిగితే కొద్దిగా ముడుచుకోవడం సాధారణమే.
ఎప్పుడు కడగాల్సిన అవసరం ఉండకపోవచ్చు?
అన్ని బట్టలను వెంటనే కడగాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఉదాహరణకు జాకెట్లు లేదా చర్మాన్ని నేరుగా తాకని దుస్తులు వెంటనే కడగకపోయినా పెద్ద సమస్య ఉండదు. అలాగే “డ్రై క్లిన్ ఓన్లీ” అని ఉన్న బట్టలను ఇంట్లో కడిగితే అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొత్త బట్టలు కడగకుండా వేసుకుంటే ప్రతిసారీ సమస్య రాకపోయినా, కొంత ప్రమాదం మాత్రం ఉంటుంది. ముఖ్యంగా డార్క్ కలర్ బట్టలు, ఉదాహరణకు డెనిమ్ జీన్స్ మొదటిసారి రంగు వదిలే అవకాశం ఉంటుంది. దీంతో చర్మంపై లేదా ఇతర బట్టలపై రంగు పడే ప్రమాదం ఉంటుంది.




