Shriya Pilgaonkar: పక్షుల కోసం 1500 మొక్కలు నాటిన శ్రియా పిల్గావ్‌కర్

Shriya Pilgaonkar: నటి శ్రియా పిల్గావ్‌కర్ తన తల్లి సుప్రియతో కలిసి పక్షులు, వన్యప్రాణుల ఆవాసం కోసం 1500 దేశీయ మొక్కలను నాటి అడవిని సృష్టించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 July 2026 4:30 AM IST
Shriya Pilgaonkar
X

Shriya Pilgaonkar: పక్షుల కోసం 1500 మొక్కలు నాటిన శ్రియా పిల్గావ్‌కర్

Shriya Pilgaonkar: ప్రముఖ నటి శ్రియా పిల్గావ్‌కర్ తన తల్లి, సీనియర్ నటి సుప్రియా పిల్గావ్‌కర్‌తో కలిసి ఒక హృద్యమైన హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో పక్షులకు, వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసంగా మారేలా ఒక చిన్న అడవిని (మిని ఫారెస్ట్) సృష్టించే లక్ష్యంతో ఈ తల్లికూతుళ్లు ఏకంగా 1,500 దేశీయ మొక్కలను నాటారు. దీనికి సంబంధించిన చిత్రాలను శ్రియా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

తల్లి కలలను నిజం చేస్తూ:

ఒక విశాలమైన భూభాగంలో వందలాది మొక్కలను క్రమపద్ధతిలో నాటిన ఫొటోలను షేర్ చేస్తూ శ్రియా ఎమోషనల్ అయ్యారు. తన తల్లి సుప్రియా పిల్గావ్‌కర్‌ను ట్యాగ్ చేస్తూ.. "మొక్కల నుండి సహనం, దృఢత్వం, కరుణను నేర్చుకుంటున్నాను. పక్షులు, తేనెటీగలు, మరెన్నో జీవులకు నిలయంగా మారేలా 1500 దేశీయ మొక్కలను నాటాం. నా తల్లి కలను నిజం చేస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు. సుప్రియ సైతం ఈ హరిత యజ్ఞం తాలూకూ చిత్రాలను పంచుకుంటూ.. "ప్రకృతి కోసం మీ వంతు ప్రయత్నం మీరు చేయండి" అని నెటిజన్లకు పిలుపునిచ్చారు.

చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు:

తెలియని వారి కోసం.. శ్రియా పిల్గావ్‌కర్ ప్రముఖ నటులైన సచిన్, సుప్రియా పిల్గావ్‌కర్‌ల కుమార్తె. తన తండ్రితో కలిసి ‘ఏకుల్టీ ఏక్’ అనే మరాఠీ చిత్రంతో అరంగేట్రం చేసిన శ్రియా, ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘ఫ్యాన్’, ఓటీటీలో ‘మిర్జాపూర్’, ‘ది బ్రోకెన్ న్యూస్’, ‘తాజా ఖబర్’ వంటి సూపర్ హిట్ సిరీస్‌లతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆమె తల్లి సుప్రియా పిల్గావ్‌కర్ నాలుగు దశాబ్దాలుగా టెలివిజన్, సినిమా రంగాల్లో కొనసాగుతూ ‘తు తు మైన్ మెయిన్’, ‘ససురల్ గెండా ఫూల్’ వంటి క్లాసిక్ షోలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ ఫ్యామిలీ చేపట్టిన పర్యావరణ హిత కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story