Health Tips: కదలకుండా గంటల తరబడి కూర్చుంటున్నారా? సిట్టింగ్ ఈజ్ ది న్యూ స్మోకింగ్!

రోజంతా కదలకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిని 'సిట్టింగ్ ఈజ్ ది న్యూ స్మోకింగ్' అని అభివర్ణిస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 22 July 2026 8:34 PM IST
Health Tips
X

Health Tips: కదలకుండా గంటల తరబడి కూర్చుంటున్నారా? సిట్టింగ్ ఈజ్ ది న్యూ స్మోకింగ్!

Health Tips: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఎక్కువ మంది గంటల తరబడి కుర్చీలకే పరిమితమై పనిచేయాల్సి వస్తోంది. ఐటీ ఉద్యోగులు, ఆఫీసుల్లో పనిచేసేవారు రోజంతా కంప్యూటర్ల ముందు కదలకుండా కూర్చుంటున్నారు. అయితే ఇలా గంటల తరబడి కదలకుండా కూర్చోవడం ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సరిగ్గా వ్యాయామం లేకుండా కూర్చునే ఈ అలవాటును ప్రస్తుత కాలంలో 'సిట్టింగ్ ఈజ్ ది న్యూ స్మోకింగ్' అని పిలుస్తున్నారు. దీనివల్ల శరీరంలో అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ తీవ్రంగా మందగిస్తుంది. దీనివల్ల క్రమంగా బరువు పెరగడం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం విపరీతంగా పెరుగుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కండరాలు బలహీనపడటంతో పాటు వెన్నునొప్పి వంటి సమస్యలు కూడా చుట్టుముడతాయి. కాబట్టి ఈ ప్రమాదాల నుంచి బయటపడాలంటే జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ఎంతో అవసరం.

కాగా, ఈ అనారోగ్య సమస్యలను నివారించడానికి ప్రతి అర్ధగంటకోసారి కుర్చీ నుంచి లేచి కాస్త నడవడం, నిలబడి మాట్లాడటం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు వీలైతే మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న శారీరక కదలికలతో శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story