Health Tips: తినగానే నిద్రపోతున్నారా.? అయితే లావైపోతారు జాగ్రత్త.!

Health Tips: రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతున్నారా? అయితే మీరు కచ్చితంగా బరువు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 11 Jun 2026 4:43 PM IST
Health Tips
X

Health Tips: తినగానే నిద్రపోతున్నారా.? అయితే లావైపోతారు జాగ్రత్త.!

Health Tips: రోజువారీ పనులతో అలిసిపోయి ఇంటికి రాగానే, రాత్రి భోజనం చేసిన వెంటనే చాలామందికి నిద్రముంచుకొస్తుంది. టీవీ చూస్తూనో, మొబైల్ చూస్తూనో తిన్న వెంటనే బెడ్ ఎక్కేస్తుంటారు. కానీ మనలో చాలామంది చేసే ఈ సాధారణ అలవాటు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మనం తిన్న ఆహారం శరీరంలో జీర్ణమై శక్తిగా మారాలి. కానీ రాత్రి పూట భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల శరీరానికి ఎలాంటి శారీరక శ్రమ ఉండదు. దీనివల్ల ఆ ఆహారం శక్తిగా మారడానికి బదులుగా కొవ్వుగా మారిపోయి, వేగంగా బరువు పెరిగే అవకాశం ఉంది. తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. మనం నిటారుగా ఉన్నప్పటి కంటే, పడుకున్నప్పుడు జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.

జీర్ణం కాని ఆహారం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ లాంటి ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల వల్ల రాత్రిపూట ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి భోజనం తర్వాత కొన్ని చిన్నపాటి నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు..

నడక తప్పనిసరి: రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటైనా ఇంట్లో లేదా ఆరుబయట నెమ్మదిగా నడవాలి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.

నిద్రకు గ్యాప్ ఇవ్వాలి: భోజనం చేసిన వెంటనే కాకుండా, కనీసం 2 గంటల సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. ఈ చిన్నపాటి మార్పులను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఊబకాయం, గ్యాస్ సమస్యలకు దూరంగా ఉండి, ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story