Sleeping: హెల్తీ హార్ట్ కోసం లైట్లు ఆపేసి నిద్రపోండి.! ఆసక్తికర విషయాలు ఇవిగో!
Sleeping: రాత్రి నిద్రపోయేటప్పుడు గదిలో చిన్న వెలుతురు ఉన్నా గుండెకు ప్రమాదమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Sleeping: హెల్తీ హార్ట్ కోసం లైట్లు ఆపేసి నిద్రపోండి.! ఆసక్తికర విషయాలు ఇవిగో!
Sleeping: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రాత్రి పూట సరైన నిద్రలేకపోవడం వల్ల శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే సమయంలో గదిలో చిన్న లైట్లు లేదా వెలుతురు ఉంటే అది గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫోన్లు, టీవీలు లేదా బయట వీధి దీపాల నుంచి వచ్చే చిన్న వెలుతురు వల్ల కూడా రాత్రి వేళ నిద్రలో గుండెకు తగిన విశ్రాంతి దొరకదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో సంపూర్ణమైన చీకటిలో నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని వారు సూచిస్తున్నారు.
నిద్రపోయే సమయంలో గదిలో వెలుతురు ఉండటం వల్ల రక్తపోటు పెరిగి గుండె బలహీనపడే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రాత్రి వేళల్లో మెదడులోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిపై కాంతి ప్రభావం చూపుతుంది. ఈ హార్మోన్ లోపం వల్ల నిద్ర నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది.
నిద్రలేమి సమస్య కారణంగా రక్తపోటు అదుపు తప్పి గుండె జబ్బులు వచ్చే ముప్పు పెరుగుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రివేళ గదిలోని లైట్లన్నీ ఆపేసి పూర్తి చీకటిలో నిద్రపోవడం చాలా మంచిది అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
కొంతమంది రాత్రి పూట పడుకునేటప్పుడు చిన్న నైట్ లాంప్లు వేసుకునే అలవాటు కలిగి ఉంటారు. మరికొందరు ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి అలాగే నిద్రపోతుంటారు. ఇలాంటి చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో ప్రాణాంతక సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే మంచి నిద్ర అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం.




