Health Tips: రోజంతా ఇంట్లోనే ఉంటున్నారా.? అలానే ఉంటే.. పిచ్చెక్కిపోవడం గ్యారెంటీనట.!
Health Tips: రోజంతా ఇంట్లోనే ఉండటం వల్ల విటమిన్-డి లోపం, హార్మోన్ల సమస్యలు శ్వాస ఇబ్బందులు కలుగుతాయి.
Health Tips: రోజంతా ఇంట్లోనే ఉంటున్నారా.? అలానే ఉంటే.. పిచ్చెక్కిపోవడం గ్యారెంటీనట.!
Health Tips: ప్రస్తుత కాలంలో చాలామంది ఇంటి పనులు, వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ స్క్రీన్ల మోజులో రోజంతా ఇంటి పట్టునే గడుపుతుంటారు. బయటకు వెళ్లడం తగ్గించి గదులకే పరిమితమవుతున్నారు. అయితే ఇలా రోజంతా ఇంట్లోనే ఉండటం ఫిజికల్ మెంటల్ హెల్త్‌కు ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సూర్యరశ్మి తగకపోవడం, గాలి సరిగ్గా ఆడని గదుల్లో ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శరీరానికి ప్రకృతి సిద్ధమైన వాతావరణం అందకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
ఉదయం పూట ఎండ తగలకపోతే శరీరంలో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. ఎముకల బలం తగ్గడంతో పాటు కీళ్ల నొప్పులు వస్తాయి. శరీరంలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్త ప్రసరణ మందగించి బరువు పెరగడం ఊబకాయం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే సూర్యకాంతి తగలకపోవడం వల్ల మెదడులో సెరోటోనిన్ మెల్టోనిన్ హార్మోన్ల ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల నిద్రలేమి, మానసిక కుంగుబాటు, నిరాశ నిస్పృహలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత కొరవడి చిరాకు పెరుగుతుంది.
బయటి వాతావరణంతో పోలిస్తే సరిపడా గాలి వెలుతురు లేని ఇంట్లోని గదుల్లో ఇండోర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. దుమ్ము, ధూళి, రసాయనాల ప్రభావం వల్ల శ్వాసకోశ సమస్యలు ఆస్తమా ముప్పు పెరుగుతాయి. అందుకే రోజూ ఉదయం సూర్యకాంతిలో కొంత సమయం గడపాలి. ఇళ్లలోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా విండోలు తలుపులు తరచుగా తెరవాలి. రోజువారీ వ్యాయామాలు నడక అలవర్చుకోవాలి. ప్రకృతితో మమేకమయ్యే సమయం కేటాయించాలి. చిన్నపాటి మార్పులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నిత్యం ఉత్సాహంగా ఉండటానికి పాజిటివ్ ఆలోచనలు అవసరం. ఆఫీస్ పని మధ్యలో విరామం తీసుకుని బయట వాతావరణాన్ని ఆస్వాదించాలి. ఆరోగ్యకరమైన అలవాట్లతో శారీరక మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు.




