Weight Loss Risks: అక‌స్మాత్తుగా బ‌రువు త‌గ్గుతున్నారా.? వెంట‌నే ఈ ప‌రీక్ష‌లు చేయించుకోండి

Sudden Weight Loss Reasons: మన శరీర బరువు మన ఆరోగ్య పరిస్థితిని సూచించే ముఖ్యమైన సూచిక. సాధారణంగా బరువు పెరగడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Mokshith
Published on: 22 March 2026 1:29 PM IST
Sudden Weight Loss Reasons
X

Sudden Weight Loss Reasons

Unexplained Weight Loss Causes: మన శరీర బరువు మన ఆరోగ్య పరిస్థితిని సూచించే ముఖ్యమైన సూచిక. సాధారణంగా బరువు పెరగడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఎలాంటి డైట్, వ్యాయామం లేకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా ప్ర‌మాద‌మే అని నిపుణులు చెబుతున్నారు.

అకస్మాత్తుగా బరువు తగ్గడం ఎందుకు ప్రమాదకరం?

ఆరోగ్య సమాచారం అందించే హెల్త్‌లైన్ వెబ్‌సైట్ ప్రకారం, మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేసినప్పుడు బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. దీనిని హైపర్‌థైరాయిడిజం అంటారు. ఈ పరిస్థితిలో శరీర మెటాబాలిజం వేగంగా పెరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేస్తే తర్వాత పెద్ద ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

5 శాతం కంటే ఎక్కువ బరువు తగ్గితే జాగ్రత్త

ఎలాంటి ప్రయత్నం చేయకుండా 6 నుంచి 12 నెలలలో శరీర బరువు మొత్తం లో 5 శాతం కంటే ఎక్కువ తగ్గితే అది ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఉదాహరణకు 60 కిలోల బరువు ఉన్న వ్యక్తి 3 కిలోలకంటే ఎక్కువ తగ్గితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

డయాబెటిస్ వల్ల కూడా బరువు తగ్గవచ్చు

టైప్-2 డయాబెటిస్ ఉన్నప్పుడు శరీరానికి సరైన విధంగా ఇన్సులిన్ పనిచేయకపోవచ్చు. దాంతో శరీరానికి అవసరమైన శక్తి అందదు. మరోవైపు ఎక్కువ మూత్ర విసర్జన సమయంలో గ్లూకోజ్‌తో పాటు క్యాలరీలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ఈ కారణంగా శరీరం వేగంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.

హైపర్‌థైరాయిడిజం ప్రభావం

హైపర్‌థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా హార్మోన్లు విడుదల చేసే పరిస్థితి. దీని వల్ల మెటాబాలిజం వేగం పెరుగుతుంది. ఆశ్చర్యకరంగా, ఆకలి ఎక్కువగా ఉన్నప్పటికీ బరువు తగ్గడం జరుగుతుంది. దీనితో పాటు గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువగా చెమట పడటం, ఆందోళన, నిద్ర సమస్యలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

క్యాన్సర్, స్ట్రెస్‌తో పాటు ఇతర కారణాలు

క్యాన్సర్ ఉన్నప్పుడు శరీరంలో మెటాబాలిజం మారుతుంది. క్యాన్సర్ కణాలు శరీర శక్తిని ఎక్కువగా వినియోగిస్తాయి. ఫలితంగా ఆకలి తగ్గి బరువు తగ్గుతుంది. అలాగే డిప్రెషన్, అధిక ఒత్తిడి ఉన్నప్పుడు చాలా మంది తినే ఆహారం తగ్గిస్తారు. దీని వల్ల కూడా బరువు తగ్గుతుంది. ఆల్క‌హాల్ అల‌వాటు ఉన్న వారు తరచుగా ఆహారం సరిగా తీసుకోరు. దీని వల్ల రోగనిరోధక శక్తి తగ్గి బరువు కూడా తగ్గుతుంది.

Mokshith

Mokshith

Next Story