Immunity Power: మన బాడీలో స్కూల్ ఆఫ్ ఇమ్యూనిటీ ఏంటో తెలుసా.. చాలామందికి తెలియని సీక్రెట్..?

Immunity Power: చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి, వారిని నిరంతరం రోగాల బారి నుంచి కాపాడే ఒక ప్రత్యేకమైన గ్రంధి ఉంటుంది.

Venkat
Published on: 10 Jun 2026 8:35 PM IST
Thymus gland benefits child immunity secrets dr manthena health tips
X

Immunity Power: మన బాడీలో స్కూల్ ఆఫ్ ఇమ్యూనిటీ ఏంటో తెలుసా.. చాలామందికి తెలియని సీక్రెట్..?

Thymus Gland: పెద్దల కంటే చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని మన ఇంట్లోని పెద్దలు, డాక్టర్లు తరచూ చెబుతుంటారు. అయితే దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ రహస్యం మీకు తెలుసా? పిల్లల శరీరంలో మాత్రమే ఉంటూ, రక్షణ వ్యవస్థను ఒక సైన్యంలా తీర్చిదిద్దే అద్భుతమైన గ్రంధి 'థైమస్ గ్లాండ్'.

స్కూల్ ఆఫ్ ఇమ్యూనిటీ..

చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి, వారిని నిరంతరం రోగాల బారి నుంచి కాపాడే ఒక ప్రత్యేకమైన గ్రంధి ఉంటుంది. దాన్నే శాస్త్రవేత్తలు 'థైమస్ గ్లాండ్' లేదా 'థైమస్ గ్రంధి' అని పిలుస్తారు. దీనిని శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన స్కూల్ ఆఫ్ ఇమ్యూనిటీ అని కూడా అనవచ్చు. మన దేశాన్ని రక్షించడానికి త్రివిధ దళాలు (ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్) ఎలాగైతే సరిహద్దుల్లో పోరాడుతుంటాయో, అలాగే మన శరీరాన్ని కాపాడటానికి తెల్ల రక్త కణాలు అనే 'పంచదళాలు' పనిచేస్తాయి. ఈ రక్షక కణాలన్నింటికీ చిన్నప్పుడే శత్రువులతో ఎలా పోరాడాలో నేర్పించే ప్రధాన శిక్షణా కేంద్రమే ఈ థైమస్ గ్రంధి.

గుండె చెంతనే ఉండే ఈ గ్రంధి కాలక్రమేణా ఎందుకు అంతరిస్తుంది?

ఈ థైమస్ గ్రంధి మన శరీరంలో గుండెకు దగ్గరగా, ఛాతి ఎముక మధ్య భాగంలో అమరి ఉంటుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచి మొదటి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఈ గ్రంధి అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వయస్సు పెరిగే కొద్దీ ఈ గ్రంధి పరిమాణం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. పిల్లలకి 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఈ గ్రంధి శరీరంలో పూర్తిగా అంతరించిపోతుంది. ఎందుకంటే, శరీరంలోని రక్షక కణాలన్నింటికీ కావాల్సిన పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం పూర్తయిన తర్వాత, ఇక ఈ పాఠశాల అవసరం శరీరానికి ఉండదు. అందుకే పెద్దవారి శరీరంలో ఈ గ్రంధి కనిపించదు.

తెల్ల రక్త కణాలకు బాధ్యతల విభజన..

మన శరీరంలోని తెల్ల రక్త కణాలు ఐదు రకాలుగా ఉంటాయి. అవి: మోనోసైట్లు, ఇమ్యునోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్లు. మిలిటరీలో ఒక్కొక్క దళానికి ఒక్కో రకమైన బాధ్యతలు ఉన్నట్లే, థైమస్ గ్రంధి కూడా ఈ తెల్ల రక్త కణాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది.

మోనోసైట్లు: శరీరంలోకి ప్రవేశించే వైరస్, బ్యాక్టీరియాలను గుర్తించి వాటిని ఎలా మింగేయాలో ఈ కణాలకు థైమస్ గ్రంధి నేర్పుతుంది.

నేచురల్ కిల్లర్ సెల్స్: హానికరమైన క్రిములను నేరుగా పొడిచి చంపేసే ఆయుధాలుగా వీటిని మలుస్తుంది.

టీ హెల్పర్ సెల్స్: ఇవి శరీరంలో పహారా కాసే పోలీసుల వంటివి. ఏ చిన్న కొత్త వైరస్ వచ్చినా వెంటనే రక్షణ వ్యవస్థకు సమాచారం అందిస్తాయి.

బి సెల్స్ & మెమరీ సెల్స్: గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్లను గుర్తుపెట్టుకుని, భవిష్యత్తులో అవి మళ్లీ దాడి చేయకుండా రక్షణ కవచాన్ని (యాంటీబాడీస్) తయారు చేయడం నేర్చుకుంటాయి.

క్యాన్సర్ నివారణలోనూ కీలక పాత్ర..

శరీరంలోని మంచి కణాలు ఏవి, ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలు ఏవి అని గుర్తించే విజ్ఞానాన్ని కూడా ఈ గ్రంధే కణాలకు అందిస్తుంది. ఏదైనా కణం క్యాన్సర్ కణంగా మారుతున్నట్లు అనుమానం వస్తే, దాన్ని అక్కడికక్కడే నాశనం చేసేలా రక్షణ వ్యవస్థను ఇది సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా, మన రక్షణ వ్యవస్థే మన శరీరంపై దాడి చేసే 'ఆటో ఇమ్యూన్' వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో ఈ గ్రంధి పాత్ర ఎంతో అమూల్యమైనది. అయితే, పిల్లల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటే ఈ థైమస్ గ్రంధి పనితీరు దెబ్బతింటుంది.

పిల్లల మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతూ, చిన్నప్పటి నుంచి వారికి మంచి పోషకాహార అలవాట్లను అలరింపజేస్తే, ఈ థైమస్ గ్రంధి మరింత చురుగ్గా పనిచేస్తుంది. చిన్నతనంలో లభించే ఈ పటిష్టమైన రక్షణ శిక్షణ, ఆ పిల్లలు పెద్దయ్యాక కూడా జీవితకాలం పాటు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు అండగా నిలుస్తుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story