Health Tips: మందుల అవసరం లేదు! రోజూ ఈ మూడు తీసుకుంటే చాలు.. మీ బాడీకి ఒక 'కవచం'లా పనిచేస్తాయి

Health Tips: బిజీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఒత్తిడి, అలసటను తగ్గించుకోవాలా? మీ వంటింట్లో దొరికే అశ్వగంధ, తులసి, మునగ (Moringa) వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను ఈ స్టోరీలో తెలుసుకోండి. సహజ సిద్ధంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నిపుణుల సూచనలు ఇవే.

Ganesh
Published on: 15 March 2026 4:43 PM IST
Health Tips
X

Health Tips: మందుల అవసరం లేదు! రోజూ ఈ మూడు తీసుకుంటే చాలు.. మీ బాడీకి ఒక 'కవచం'లా పనిచేస్తాయి

Health Tips: ఉరుకుల పరుగుల జీవితం, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి కోసం ఖరీదైన మందులు, సప్లిమెంట్లపై ఆధారపడకుండా, మన వంటగదిలోని కొన్ని సహజసిద్ధమైన మూలికలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మనం రోజూ తీసుకోవాల్సిన టాప్ 3 అద్భుత మూలికల గురించి వివరించారు. అవేంటంటే ..

1. అశ్వగంధ

ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. అశ్వగంధను శరీరానికి ఒక "వరం"గా అభివర్ణించారు. ఇది ఒక అద్భుతమైన 'అడాప్టోజెన్' అని వెల్లడించారు. ఇది ఒత్తిడి నివారిణి అని చెప్పారు. ఇది మన శరీరం ఒత్తిడిని తట్టుకునేలా చేయడంతో పాటు, ఆందోళనను తగ్గిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఇది రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టని వారికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. వ్యాయామం చేసేవారికి కండరాలు త్వరగా కోలుకోవడానికి (Muscle Recovery) ఇది సహాయపడుతుందన్నారు.

2. తులసి

తులసి కేవలం మొక్క మాత్రమే కాదని, అద్భుతమైన యాంటీ-మైక్రోబియల్ గుణాలున్న మూలిక అని చెప్పారు. సీజన్ మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఇది మనల్ని రక్షిస్తుందన్నారు. అలాగే తులసి తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పని చేయడమే కాకుండా, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు.

3. మునగ (Moringa)

మునగలో విటమిన్ సి, కాల్షియం, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని వెల్లడించారు. విపరీతమైన అలసటగా ఉన్నప్పుడు మునగ తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని చెప్పారు. మధుమేహ బాధితులకు కూడా ఇది ఒక ఔషధంలా పనిచేస్తుందన్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుందని చెప్పారు. దీంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుందని పేర్కొన్నారు. అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా పని చేస్తుందన్నారు.

గమనిక: ఏదైనా కొత్త మూలికను లేదా సప్లిమెంట్‌ను మీ ఆహారంలో చేర్చుకునే ముందు, మీ వ్యక్తిగత ఆరోగ్య స్థితిని బట్టి ఒకసారి వైద్యుని సంప్రదించడం మంచిది.

Ganesh

Ganesh

Next Story