Vastu Tips: అర‌టి చెట్టుతో ఆర్థిక క‌ష్టాల‌న్నీ ప‌రార్‌.. ఏం చేయాలంటే.?

Vastu Tips: ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు వాస్తు ప‌రిష్కారం చూపుతుంద‌ని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి వాస్తు ప‌రిష్కారాల్లో అర‌టి చెట్టు ఒక‌టి. అరటి చెట్టు మన ఇంట్లో వాస్తు దోషాలను తొలగించి, కుటుంబానికి శ్రేయస్సును, ఆర్థిక పుష్టిని ఇస్తుందని చెబుతున్నారు.

Mokshith
Updated on: 12 March 2026 3:09 PM IST
Vastu Tips: అర‌టి చెట్టుతో ఆర్థిక క‌ష్టాల‌న్నీ ప‌రార్‌.. ఏం చేయాలంటే.?
X

Vastu Tips: అర‌టి చెట్టుతో ఆర్థిక క‌ష్టాల‌న్నీ ప‌రార్‌.. ఏం చేయాలంటే.?

Vastu Tips: ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు వాస్తు ప‌రిష్కారం చూపుతుంద‌ని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి వాస్తు ప‌రిష్కారాల్లో అర‌టి చెట్టు ఒక‌టి. అరటి చెట్టు మన ఇంట్లో వాస్తు దోషాలను తొలగించి, కుటుంబానికి శ్రేయస్సును, ఆర్థిక పుష్టిని ఇస్తుందని చెబుతున్నారు.

హిందూ సంప్రదాయాల్లో చెట్లకు ఉన్న ప్రాధాన్యం

హిందూ సంప్రదాయాల్లో చెట్లు, మొక్కలను పవిత్రంగా భావిస్తారు. దేవతలు చెట్లలో నివసిస్తారని నమ్మకం ఉంది. అందుకే అనేక పూజలు, శుభకార్యాల్లో చెట్లకు సంబంధించిన ఆకులు, మొక్కలను ఉపయోగిస్తారు. పూజ‌ల్లో

తులసి ఆకులు, మామిడి ఆకులు, అరటి ఆకులు ఉప‌యోగించ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వివాహాలు, శుభకార్యాల్లో అరటి చెట్టుకు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు.

అరటి చెట్టుతో విష్ణు సంబంధం

పురాణ విశ్వాసాల ప్రకారం అరటి చెట్టులో విష్ణువు నివసిస్తాడని చెబుతారు. అందుకే అరటి మొక్కను పవిత్రంగా భావించి పూజిస్తారు. విష్ణువును ఆరాధించడం వల్ల ఇంట్లో శాంతి, శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం. అరటి చెట్టు దగ్గర పూజ చేస్తే కుటుంబానికి శుభం జరుగుతుందని, ఆర్థికంగా కూడా స్థిరత్వం వస్తుందని కొంతమంది నమ్ముతారు.

ఆర్థిక సమస్యలు తగ్గేందుకు చేసే వాస్తు ఆచారాలు

వాస్తు నమ్మకాల ప్రకారం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు అరటి చెట్టుతో కొన్ని పూజలు చేస్తారు. అరటి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయడం, చెట్టు వేరుకు బెల్లం, శనగపప్పు, పసుపు సమర్పించడం వంటివి చేయ‌డం వ‌ల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని విశ్వ‌సిస్తారు. అందుకే ఇంట్లో అర‌టి చెట్టును పెంచుకుంటే మంచి జ‌రుగుతుంద‌ని న‌మ్మకం.

ఇంట్లో సానుకూల వాతావరణం కోసం

వాస్తు ప్రకారం అరటి చెట్టు వేరుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో ప్రతికూల శక్తులు తగ్గించి సానుకూలత పెంచేందుకు కొన్ని ఆచారాలు చేస్తారు. అరటి చెట్టును ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచడం వ‌ల్ల ఇంట్లో ఆనందం, శాంతి పెరుగుతాయని నమ్మకం ఉంది.

వివాహం, సంపద కోసం

కొన్ని వాస్తు నమ్మకాల ప్రకారం అరటి చెట్టుతో చేసే పూజలు వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపుతాయని చెబుతారు. వివాహం ఆలస్యమవుతున్న వారు గురువారం రోజున పసుపు దుస్తులు ధరించి అరటి చెట్టుకు పూజ చేయడం మంచిదని అంటారు సంపద పెరగాలని కోరుకునేవారు అరటి వేరును ఎరుపు వస్త్రంలో కట్టి ఇంట్లో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల అదృష్టం పెరుగుతుందని కొంతమంది నమ్ముతారు.

గమనిక: వాస్తు, ఆధ్యాత్మిక విశ్వాసాలు వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడినవే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని గ‌మ‌నించాలి.

Mokshith

Mokshith

Next Story