Vitamin D: విటమిన్ 'డి' కోసం ట్యాబ్లెట్లు వాడుతున్నారా? సూర్యరశ్మి కూడా ఎంత అవసరమో తెలుసా?
శరీరానికి అవసరమైన విటమిన్ 'డి' కోసం కేవలం సప్లిమెంట్లపైనే ఆధారపడుతున్నారా? ఆధునిక జీవనశైలి కారణంగా దూరమవుతున్న ప్రకృతి సిద్ధమైన సూర్యరశ్మి మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
Vitamin D: విటమిన్ 'డి' కోసం ట్యాబ్లెట్లు వాడుతున్నారా? సూర్యరశ్మి కూడా ఎంత అవసరమో తెలుసా?
Vitamin D: ప్రస్తుత ఆధునిక ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలామంది సూర్యరశ్మికి పూర్తిగా దూరమవుతున్నారు. రోజంతా ఇళ్లలోనే లేదా ఆఫీసులకే పరిమితం కావడం వల్ల శరీరానికి తగినంత సహజ కాంతి అందక అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఎముకల పటిష్టతకు, రోగనిరోధక శక్తికి అత్యంత కీలకమైన విటమిన్ 'డి' లోపం నేడు సర్వసాధారణం అయిపోయింది. ఈ సమస్యను నివారించడానికి కృత్రిమంగా లభించే విటమిన్ 'డి' సప్లిమెంట్లు లేదా మాత్రలపై ఆధారపడే వారి సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. అయితే మాత్రల మోజులో పడకుండా ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన సూర్యరశ్మిని ఆస్వాదించాలని ఆరోగ్య నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు.
విటమిన్ 'డి' సప్లిమెంట్ల కంటే ప్రకృతి సిద్ధమైన సూర్యరశ్మి శరీయానికి ఎంతో అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చర్మానికి సహజసిద్ధమైన ప్రయోజనాలను చేకూర్చే అనేక ప్రత్యేక గుణాలు కేవలం సూర్యరశ్మి ద్వారానే లభిస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఉదయం పూట లభించే లేత ఎండలో కొంత సమయం గడపడం ద్వారా శరీరం సహజంగానే విటమిన్ 'డి'ని తయారు చేసుకుంటుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కానీ సహజ కాంతికి దూరమై కేవలం మందుల మీద మాత్రమే ఆధారపడటం దీర్ఘకాలంలో సరికాదని హెచ్చరిస్తున్నారు.
కాగా, నిత్య జీవితంలో కాస్త సమయం కేటాయించి తగినంత సహజ కాంతిని ఆస్వాదించడం ద్వారా శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సహజ సిద్ధమైన మార్గాలను విస్మరించి మాత్రలను ఆశ్రయించడం కంటే, జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ఉత్తమం. ప్రకృతి అందించే సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వైద్యులు మరోసారి గుర్తు చేస్తున్నారు.




