Health Tips: ఈ 4 టిప్స్ పాటించారంటే కొబ్బరిబొండంలా ఉన్న పొట్ట ఇట్టే కరిగిపోవాల్సిందే.!

Health Tips: మీ డైలీ రొటీన్‌లో 4 చిట్కాలను భాగం చేసుకుంటే వెయిట్ లాస్ కావచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.

Ravi
By Ravi
Published on: 16 Aug 2026 5:03 PM IST
Health Tips
X

Health Tips: ఈ 4 టిప్స్ పాటించారంటే కొబ్బరిబొండంలా ఉన్న పొట్ట ఇట్టే కరిగిపోవాల్సిందే.!

Health Tips: శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దైనందిన జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లను మార్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ రొటీన్‌లో కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఉదయం సమయంలో తీసుకునే ఆహారం నుంచి రాత్రి పడుకునే వరకు కొన్ని నియమాలను పాటించడం చాలా అవసరం.

ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో గుడ్లు, చియా గింజలు, అవిసె గింజలు, పీనట్ లేదా ఆల్మండ్ బట్టర్, బాదం అలాగే వాల్‌నట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి. వీటిలో మంచి కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. దీనివల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అన్నీ అదుపులో ఉంటాయి. అలాగే రోజువారీ జీవితంలో నడకను ఒక అలవాటుగా మార్చుకోవడం ఎంతో ముఖ్యం. రోజూ పది వేల నుంచి పన్నెండు వేల స్టెప్స్ నడిస్తే శరీరంలోని అదనపు క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి.

ఆహారంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవడం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పీచు పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా త్వరగా ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది. దీనితో పాటు రాత్రి సమయంలో భోజనం చేసే వేళలపై కూడా శ్రద్ధ పెట్టాలి. సాధారణంగా రాత్రి నిద్రపోయేదానికంటే కనీసం నాలుగు గంటల ముందే డిన్నర్ పూర్తి చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చిన్నపాటి జీవనశైలి మార్పులు బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో సహాయపడతాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story