Sleep: వరుసగా మూడు రోజులు నిద్రపోకపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
Sleep: వరుసగా మూడు రోజుల పాటు కంటినిండా నిద్రపోకపోతే శరీరంలో ఎలాంటి భయంకరమైన మార్పులు జరుగుతాయో తెలుసా.?
Sleep: వరుసగా మూడు రోజులు నిద్రపోకపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
Sleep: మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో.. తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, మొబైల్ ఫోన్ల వాడకం వల్ల చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే, వరుసగా మూడు రోజుల పాటు అసలు నిద్రపోకపోతే మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా.? ఓ హెల్త్ రిపోర్ట్ అధ్యయనంలో ఇలా ఉంది.
మొదటి రోజు నిద్రపోకపోతే కళ్లలో మంటలు రావడం, తలనొప్పి, చిరాకు మొదలవుతాయి. అలాగే శరీరంలో స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయని వైద్యులు తెలుపుతున్నారు. వరుసగా రెండు రోజులు నిద్రకు దూరమైతే దాని ప్రభావం గుండెపై స్పష్టంగా కనిపిస్తుంది. గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. చేతులు వణుకుతాయి, అలాగే శరీరం తన శక్తిని పూర్తిగా కోల్పోయినట్లు అనిపిస్తుంది.
వరుసగా మూడు రోజుల పాటు(72 గంటలు) కంటికి కునుకు లేకపోతే శరీరం పూర్తిగా నీరసించిపోయి కుప్పకూలే స్థితికి చేరుకుంటుంది. రోగనిరోధక శక్తి విపరీతంగా తగ్గిపోతుంది. గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల రక్తపోటు, షుగర్, ఊబకాయం, ప్రాణాంతకమైన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అత్యధికంగా పెరిగిపోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నిద్రను ఎప్పుడూ తేలికగా తీసుకోకండి. ఎన్ని పనులున్నా సమయానికి పడుకోవడం, ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవడం మన భవిష్యత్తు ఆరోగ్యానికి ఎంతో మంచిది.




