Moving Legs: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా? అది కేవలం అలవాటు కాదు.. ఓ వ్యాధి కావొచ్చు!

Moving Legs: కూర్చున్నప్పుడు కాళ్లు కదిలించడం ఒక వ్యాధి అని మీకు తెలుసా? రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అంటే ఏమిటి? దాని కారణాలు మరియు నివారణ మార్గాల గురించి పూర్తి సమాచారం.

Arun Chilukuri
Updated on: 17 April 2026 11:18 AM IST
Moving Legs
X

Moving Legs: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా? అది కేవలం అలవాటు కాదు.. ఓ వ్యాధి కావొచ్చు!

Moving Legs: చాలామంది పనిలో ఏకాగ్రత కోసం లేదా తెలియకుండానే కాళ్లు కదిలిస్తుంటారు. అయితే, ఇది పదే పదే జరుగుతుంటే దానిని రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ (Restless Legs Syndrome - RLS) అనే నాడీ సంబంధిత సమస్యగా గుర్తించాలి.

ఏమిటీ రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్?

ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య. ప్రపంచ జనాభాలో సుమారు 10 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కూర్చున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు కాళ్లలో ఒక రకమైన అసౌకర్యం, దురద లేదా నొప్పిగా అనిపిస్తుంది. కాళ్లు కదిలించినప్పుడు మాత్రమే ఆ నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ కనిపిస్తుంది.

ప్రధాన కారణాలు:

రక్తంలో ఐరన్ స్థాయిలు తగ్గడం వల్ల నరాలు సరిగ్గా పనిచేయక ఈ సమస్య తలెత్తవచ్చు. కుటుంబంలో తల్లిదండ్రులకు ఈ సమస్య ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. మెదడులోని నరాల మధ్య సంకేతాలను పంపే దోపమైన్ అనే రసాయనంలో మార్పులు రావడం వల్ల కూడా ఇలా జరగవచ్చు.

నివారణ మార్గాలు:

ఈ సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి అవసరమైన మందులు వాడాలి. ఐరన్ లోపం ఉంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల నరాల పనితీరు మెరుగుపడుతుంది.

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని hmtv ధృవీకరించలేదు)

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story