White Rice: తెల్ల అన్నం తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!
White Rice: మనం రోజూ తినే తెల్ల అన్నం ఆరోగ్యానికి అంత మంచిది కాదా? పాలిష్ చేసిన బియ్యం వల్ల మధుమేహం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎలా వస్తాయి? ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ప్రత్యామ్నాయాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
White Rice: తెల్ల అన్నం తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!
Polished Rice: భారతదేశంలో మెజారిటీ ప్రజల ప్రధాన ఆహారం అన్నం. అయితే మనం రోజూ ఆస్వాదించే పాలిష్ చేసిన తెల్లటి బియ్యం (White Rice) ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహంతో బాధపడేవారు వైట్ రైస్‌కు దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
పాలిష్ చేస్తే పోషకాలు ఖతం!
బియ్యాన్ని ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి పాలిష్ చేసే క్రమంలో అందులో ఉండే విలువైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ పూర్తిగా తొలగిపోతాయి. మిగిలేది కేవలం కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ మాత్రమే. ఇవి శరీరంలోకి చేరిన వెంటనే రక్తంలోని చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి.
వైట్ రైస్ ఎందుకు వద్దు?
అధిక గ్లైసెమిక్ ఇండెక్స్: తెల్ల అన్నం జీర్ణమైన వెంటనే గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు అత్యంత ప్రమాదకరం.
బరువు పెరుగుదల: పాలిష్ చేసిన అన్నం తింటే కడుపు త్వరగా నిండదు. దీనివల్ల తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకుంటాం, ఫలితంగా బరువు వేగంగా పెరుగుతాం.
పోషకాల లోపం: పాలిష్డ్ రైస్‌లో శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు ఉండవు.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు:
ఆరోగ్యంగా ఉండాలంటే పాలిష్ చేయని బియ్యం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బ్రౌన్ రైస్ (Brown Rice): ఇందులో ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
బ్లాక్ లేదా రెడ్ రైస్: ఇవి యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాల గని.
పాలిష్ చేయని బియ్యం: వీటిని తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది, తద్వారా అతిగా తినడం మానుకోవచ్చు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం వైద్యులు అందించ సలహ, సూచనల మేరకు పొందుపరిచింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని hmtv న్యూస్ ధ్రువీకరించడం లేదు.)




