Pargi: దిర్సంపల్లిలో కలాం వర్ధంతి; ఆయన చిత్రపటానికి నివాళులు.

Pargi: దోమ మండలం దిర్సంపల్లిలో 'అబ్దుల్ కలాం యూత్' ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి నిర్వహణ. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని సభ్యుల వెల్లడి.

WAZID, PARIGI
Published on: 27 July 2026 2:43 PM IST
Pargi
X

Pargi: దిర్సంపల్లిలో కలాం వర్ధంతి; ఆయన చిత్రపటానికి నివాళులు.

PARGI :దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో 'అబ్దుల్ కలాం యూత్' కమిటీ ఆధ్వర్యంలో భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు, నాయకులు కలాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు సోను సోహెల్ మాట్లాడుతూ... భారతదేశ క్షపణి వ్యవస్థ రూపుశిల్పిగా, యువతకు ఆదర్శమూర్తిగా కలాం గారు అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. "కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి" అని ఆయన ఇచ్చిన పిలుపు ప్రతీ ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.

కలాం గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, గ్రామంలో విద్యాభివృద్ధికి, సామాజిక సేవలకు మరియు యువత సాధికారతకు అబ్దుల్ కలాం యూత్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం యూత్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, గ్రామ నాయకులు వెంకట్ రాములు, తిరుపతి, మహమ్మద్ ఖాజా, అబ్దుల్ రహుఫ్, యూసుఫ్, రాంచెంద్రరెడ్డి, గౌస్, సలీం, మన్నాన్, అఖీల్, మరియు యువకులు పాల్గొన్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story