Achampet: పత్తి తూకంలో భారీ మాయాజాలం.. ఏకంగా 10 క్వింటాళ్ల తేడా!

Achampet: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బాణాలలో పత్తి తూకంలో భారీ మోసం బయటపడింది. 41 క్వింటాళ్లుగా చెప్పిన పత్తి వేబ్రిడ్జిపై 51 క్వింటాళ్లుగా తేలడంతో రైతులు ఆగ్రహించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 23 Nov 2026 8:55 AM IST
Achampet
X

Achampet: పత్తి తూకంలో భారీ మాయాజాలం.. ఏకంగా 10 క్వింటాళ్ల తేడా!

అచ్చంపేట: బాణాలకు చెందిన రైతు రాజవర్ధన్ రెడ్డి వద్ద అచ్చంపేటకు చెందిన వ్యాపారి శంకరయ్య సుమారు 41 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి డీసీఎంలో లోడ్ చేయించుకున్నాడు. తూకంపై అనుమానం వచ్చిన రైతు గ్రామస్తులతో కలిసి డీసీఎంను అచ్చంపేటలోని వేబ్రిడ్జి వద్దకు తీసుకొచ్చి మరోసారి తూకం వేయించారు. అక్కడ 51 క్వింటాళ్లుగా తేలింది. దాదాపు 10 క్వింటాళ్ల వ్యత్యాసం రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు డీసీఎంను స్టేషన్ కు తరలించారు. అయితే వ్యాపారి ఒత్తిడి, రాజకీయ నాయకుల జోక్యంతో రైతు ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. దీంతో కేసు నమోదు కాకుండానే సాయంత్రం పోలీసులు డీసీఎంను విడిపించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, తూకంలో మోసాలకు పాల్పడ్డ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA