Achampet: వాసవి ఆలయంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతుల పూజలు

Achampet: అచ్చంపేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దంపతుల పూజలు. ఉత్సవ విగ్రహాల తాళిబొట్ల కోసం రూ.2.50 లక్షల విరాళం.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 19 Oct 2026 9:14 PM IST
Achampet
X

Achampet: వాసవి ఆలయంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతుల పూజలు

అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగ సందర్భంగా...అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ప్రార్థించారు.

*అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు తాళిబొట్ల సమర్పణ కోసం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు రూ.2,50,116 (రెండు లక్షల యాభై వేల నూట పదహారు రూపాయలు) విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA