Gadwal: రైతులు ఆరుతడి, ఆయిల్‌పామ్ పంటలు సాగు చేయాలి: వ్యవసాయ కార్యదర్శి!

Gadwal: ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులు ఆరుతడి, పామాయిల్ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ జోగుళాంబ గద్వాల జిల్లా పర్యటనలో సూచించారు.

GOKARANNA,  GADWAL
Published on: 20 Aug 2026 10:38 PM IST
Gadwal
X

Gadwal: రైతులు ఆరుతడి, ఆయిల్‌పామ్ పంటలు సాగు చేయాలి: వ్యవసాయ కార్యదర్శి!

గద్వాల్: ప్రస్తుత ఎల్ నీనో పరిస్థితులలో పంట మార్పిడిలో భాగంగా రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని, ఆయిల్ పామ్ పంటలతో కూడా మంచి ఆదాయం సమకూరుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శి సురేంద్ర మోహన్ అన్నారు.

గురువారం జిల్లాలో పర్యటించిన వ్యవసాయ శాఖ కార్యదర్శి మానోపాడ్ మండలం జల్లపూర్ గ్రామంలో రైతు కంకణాల రామ్ రెడ్డి 50 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన పామాయిల్ తోటను పరిశీలించి రైతును అభినందించారు. రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులను మిశ్రమంగా వాడుతూ తగినంత నీరు పెట్టడం వలన మంచి దిగుబడి వచ్చిందని రైతు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రైతుకు 248 టన్నులు దిగుబడి రావడంతో రూ.58.03 లక్షలు లబ్ది పొందినట్లు తెలిపారు.

బిందుసేద్యం, పామ్ మొక్కల పైన అందిస్తున్న రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే నాగన్న అనే రైతు ఎన్ఎఫ్ఎం ఎస్ ద్వారా రాయితీ పొందిన కంది పంటను పరిశీలించి రైతును అభినందించారు. అనంతరం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లిలో ఆయిల్ పామ్ నర్సరీ ని సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్యదర్శి జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగవుతున్న ఉద్యాన పంటలు, వ్యవసాయ పంటలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story