Kalwakurthy: ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జాబ్ డ్రైవ్!

Kalwakurthy: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జాబ్ డ్రైవ్ కు నియోజకవర్గ వ్యాప్తంగా 21 మంది నిరుద్యోగులు హాజరయ్యారు.

Rohith
Published on: 30 July 2026 4:06 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జాబ్ డ్రైవ్!

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాబ్ డ్రైవ్ – ఇంటర్వ్యూ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, నైపుణ్యాలను పెంపొందించుకుని ప్రతి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువతకు ఉపాధి కల్పించడం, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం లక్ష్యంగా ఇలాంటి జాబ్ డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

"యువతకు ఉద్యోగం – కుటుంబానికి భరోసా – సమాజానికి అభివృద్ధి" అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఇంటర్యూ కు కల్వకుర్తి మండలం నుండి 07 గురు , ఆమనగల్ మండలం నుండి 4 గురు, తలకొండపల్లి మండలం నుండి 5 గురు , కడ్తాల్ మండలం నుండి 5 గురు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 21 మంది నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు వీర, శ్రీనివాస్ మరియు ఐక్యత పౌండేషన్ సభ్యులు , ఇంటర్వ్యూ కు హాజరైన నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

Rohith

Rohith

Next Story