Nagarkurnool: వైద్య విద్యార్థిని సరితకు రూ.1 లక్ష సాయం: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని గుద్దటి సరితకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ.1,00,000 ఆర్థిక సాయం అందించారు.
Nagarkurnool: వైద్య విద్యార్థిని సరితకు రూ.1 లక్ష సాయం: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి!
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థిని గుద్దటి సరిత పేదరికాన్ని ఎదుర్కొంటూ పట్టుదలతో చదివి వైద్య విద్యలో సీటు సాధించారు చిన్నతనంలోనే తండ్రిన కోల్పోయిన సరితకు ఆమె తల్లి అలివేలు దినసరి కూలీగా పనిచేస్తూ చదువుకు అండగా నిలుస్తున్నారు.
విదార్థిని సరిత పరిస్థితి తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. సరిత వైద్య విద్యను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అడ్డుకోకూడదనే ఉద్దేశంతో రూ.1,00,000/- ఆర్థిక సహాయాన్ని చెక్ రూపకంగా అందించారు ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే నాతో పాటు మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి సరితకు అండగా నిలవాలని ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో.. మాజీ సర్పంచ్ లు రామచంద్రయ్య, పంతుల నాయక్, శ్రీరాములు, నరేందర్ గౌడ్, పోలే వెంకటేశ్, కృష్ణ,అల్లాజీ,రామాంజనేయులు, శ్రీను నాయక్,చంద్ర శేఖర్,కొండల్ యాదవ్, రమేష్ యాదవ్,రాహుల్ నాయక్, తో పాటు తదితరులు ఉన్నారు.




