Devarakadra: ఆయకట్టు లేని భూములకూ నీరిచ్చిన ఘనత ఆలదే: బీఆర్ఎస్

Devarakadra: ఆయకట్టు లేని భూములకు కూడా సాగునీరిచ్చిన ఘనత మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిదని దేవరకద్ర బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 29 Oct 2026 5:36 PM IST
Devarakadra
X

Devarakadra: ఆయకట్టు లేని భూములకూ నీరిచ్చిన ఘనత ఆలదే: బీఆర్ఎస్

Devarakadra: మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు బదులుగా బిఆర్ఎస్ నాయకుల విలేకరుల సమావేశం. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి డోకూరు గ్రామాన్ని సందర్శించి ఎండిన పంటల రైతులను పరామర్శించి, ఓదార్చితే ఆయకట్టులో లేని రైతుల వద్దకు వెళ్లి ఎండిన పంటలను చూయించి రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించగా, గత పది ఏళ్లలో అవగాహనతో ఆయకట్టులో లేని ఎకరాలకు కూడా ప్రతి నీటి బొట్టు ఒడిసిపట్టి నీరంధించిన ఘనత మా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ది అని అన్నారు.

ప్రస్తుతం కోయిల్ సాగర్ ప్రాజెక్టులో 20 ఫీట్ల మేర నీరు ఉన్నా అదనపు ఆయకట్టు దేవుడెరుగు కనీసం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు ఊక చెట్టు వాగుపై, అటు కందూరు వాగుపై మొత్తం 36 చెక్ డ్యాములు నిర్మిస్తే, ఇసుక దోచుకోవడం కోసం చెక్ డాంలు ధ్వంసం చేస్తున్న ఘనత మీ కాంగ్రెస్ నాయకులదని దుయ్యపట్టారు.

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో కనీసం కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చామని తెలిపారు. కాంట్రాక్టర్ల వద్ద, ఇసుకాసురుల వద్ద కమిషన్లు దోచుకోవడమే మీ పని అని అన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్ బిల్లు కోసం వెళితే లక్ష రూపాయల బిల్లులో 50వేల రూపాయలు కమిషన్ అడిగారని అన్నారు.

రైతులకు రైతుబంధు తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల సంక్షేమార్థమై అందించామని అన్నారు. మా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గత పది ఏళ్లలో ఒక్క ఎకరం పంట కూడా ఎండనీయలేదని అన్నారు. జూరాల నుండి ముందస్తుగా కోయిల్ సాగర్ కు నీళ్లు నింపుకోవాలన్న అవగాహన కూడా మీకు లేకపోయిందని వాపోయారు. ఇకపై మా ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు ఖబడ్దార్ అని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లు నరేందర్ రెడ్డి,రవీందర్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, జెట్టి నరసింహారెడ్డి, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొండారెడ్డి, సాయి మిత్ర బాలరాజ్, మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి, గురు ప్రసాద్, 11వ వార్డ్ కౌన్సిలర్ రాధా కొండల్, రాందాస్, రాధాకృష్ణ,సత్యం సాగర్, రాము గౌడ్, నరేందర్ గౌడ్, అడ్డు వివిధ గ్రామాల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA