Amanagal: గురువుల సేవలకు ఘన సన్మానం: మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్!

Amanagal: ఆమనగల్లు పట్టణంలోని మానస గార్డెన్స్‌లో ఘనంగా గురుపూజోత్సవం. మండల పరిధిలోని 150 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్. పత్యానాయక్.

A. SRINIVAS, 	SHADANAGAR
Published on: 19 Sept 2026 9:56 PM IST
Amanagal
X

Amanagal: గురువుల సేవలకు ఘన సన్మానం: మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్!

ఆమనగల్లు: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్. పత్యానాయక్ అన్నారు. గురుపూజోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమనగల్లు మండలంలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఆమనగల్లు పట్టణంలోని మానస గార్డెన్స్‌లో మండల విద్యాధికారి పగిడిపాల పాండు ఆధ్వర్యంలో శనివారం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని సుమారు 150 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్. పత్యానాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలకు సరైన దిశానిర్దేశం చేస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురువులను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అజయ్ జయరాం, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, సంఘ సేవకులు పాపిశెట్టి రాము, నక్క శ్రీనివాస్ యాదవ్, క్లాస్‌మేట్ క్లబ్ అధ్యక్షులు, జీహెచ్‌ఎం రమేష్, వాసవి ట్రస్ట్ చైర్మన్ చంద్రశేఖర్, కౌన్సిలర్ జగన్, అనూష శ్రీశైలం, జీహెచ్‌ఎం పద్మ, చందులాల్, సంఘ బాధ్యులు, మండల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

A. SRINIVAS, 	SHADANAGAR

A. SRINIVAS, SHADANAGAR