Amanagallu: ఆమనగల్లు ఆస్పత్రిలో మార్చురీ లిఫ్ట్ ఏర్పాటు DCHS అనురాగిణి!
Amanagallu: ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ.17.50 కోట్లు కేటాయించామని మరో రూ.3 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపామని డిసిహెచ్ఎస్ అనురాగిణి తెలిపారు.
Amanagallu: ఆమనగల్లు ఆస్పత్రిలో మార్చురీ లిఫ్ట్ ఏర్పాటు DCHS అనురాగిణి!
Amanagallu: ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని డీసీహెచ్‌ఎస్ అనురాగిణి రెడ్డి తెలిపారు. 50 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.17.50 కోట్లు కేటాయించిందని, భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
నూతన ఆసుపత్రి భవనానికి అవసరమైన అదనపు మౌలిక వసతుల కోసం మరో రూ.3 కోట్లు అవసరమవుతున్నాయని అనురాగిణి రెడ్డి తెలిపారు. ముఖ్యంగా మార్చురీ, కిచెన్ కమ్ డైట్ హాల్, లిఫ్ట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. ఇవి అందుబాటులోకి వస్తే ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు.
కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆమనగల్లు ఆసుపత్రి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేలా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DEE కోటయ్య,అపర్ణ,వైద్యులు నాగరాజ్,వైద్య సిబ్బంది కాంట్రాక్టర్ శంకర్ శ్రీను సురేష్ తదితరులు పాల్గొన్నారు.




