Amrabad: అమ్రాబాద్‌కు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలి

Amrabad: అమ్రాబాద్ మండలానికి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి నల్లమల రైతులకు సాగునీరు అందించాలని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణకు సాధన సమితి వినతి.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 22 Nov 2026 6:25 PM IST
Amrabad
X

Amrabad: అమ్రాబాద్‌కు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలి

అమ్రాబాద్: అమ్రాబాద్ కు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలి... నల్లమల రైతులకు సాగునీరు కల్పించాలని డిమాండ్... ఎంపీ, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన సాధన సమితి. అమ్రాబాద్ కు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలి... సీఎం పర్యటనలో సమస్యను వివరించాలని వినతి... ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణకు వినతిపత్రం. అమ్రాబాద్ మండలానికి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని ఉమ్మడి అమ్రాబాద్ మండల సాగునీటి సాధన సమితి కోరింది.

అచ్చంపేట పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ సమస్యను వివరించి, నల్లమల ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అచ్చంపేటలో ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు వినతిపత్రం అందించారు.

అమ్రాబాద్ ప్రాంత రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తేనే నల్లమల రైతులకు మేలు జరుగుతుందని సాధన సమితి నేతలు తెలిపారు

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA