Devarakadra: దేవరకద్రలో వినాయక నిమజ్జనం కోసం ఆర్టిఫిషియల్ పాండ్!
Devarakadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో వినాయక నిమజ్జనం కోసం ఆర్టిఫిషియల్ పాండ్ ఏర్పాటు. కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశాల మేరకు చర్యలు.
Devarakadra: దేవరకద్రలో వినాయక నిమజ్జనం కోసం ఆర్టిఫిషియల్ పాండ్!
Devarakadra: ఒకవైపు ఎల్ నినో ప్రభావం, మరోవైపు వినాయక విగ్రహాల రంగులతో నీరు కలుషితం కాకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశంతో దేవరకద్రలోని మున్సిపాలిటీ కేంద్రంలో, ఆర్టిఫిషియల్ పాండ్ ఏర్పాటు చేశారు. 20 ఫీట్ల వెడల్పు, 30 ఫీట్ల పొడవు, 10 ఫీట్ల లోతులో కుంటలను ఏర్పాటుచేసి నీరు భూమిలోకి ఇంక కుండా వాటిలో కవర్లు వేసి ట్యాంకర్లతో నీటిని నింపారు.
పట్టణంలో ఏర్పాటుచేసిన తక్కువ ఎత్తు గల వినాయకులను నాలుగు ఫీట్లు, ఐదు ఫీట్ల వినాయకులను ఇక్కడ ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్ పాండ్స్ లోనే నిమజ్జనం చేయాలని దేవరకద్ర మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు, చైర్మన్ దమయంతి గోవర్ధన్ రెడ్డి పట్టణ ప్రజలకు తెలియజేశారు.
దేవరకద్రలోని ప్రభుత్వ బాలికల పాఠశాల వెనుక భాగంలో వెంచర్లో గల పార్కు స్థలంలో పాండ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వినాయకులను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల వినాయక విగ్రహాలకు ఉండే రంగు ఆ నీటిలో కలిసిపోవడంతో పశుపక్షాదులకు త్రాగునీరు కలుషితం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ పాండ్ ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.




