Nagarkurnool: వాసవి ఆలయ ప్రాంగణంలో శ్రీకర ఆసుపత్రి వైద్యుల సేవా శిబిరం!
Nagarkurnool: వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆర్థో వైద్య శిబిరం. శ్రీకర ఆస్పత్రి వైద్యులచే పరీక్షలు, మందుల పంపిణీ.
Nagarkurnool: వాసవి ఆలయ ప్రాంగణంలో శ్రీకర ఆసుపత్రి వైద్యుల సేవా శిబిరం!
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో ఆర్థో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
శ్రీకర ఆసుపత్రికి చెందిన వైద్యులు శిబిరానికి హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముందు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిబిరానికి హాజరైన వైద్యులను పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బిల్లాకంటి హరిబాబు, ఆలయ కమిటీ అధ్యక్షులు అంజయ్య సన్మానించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రోగులకు సేవలు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించడంలో ఇటువంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుతోట సాయిబాబా, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు, పట్టణ కమిటీ, యువజన కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




