Wanaparthy: వరి ధాన్యం కొనాలని రైతుల ఆందోళన.. స్తంభించిన ట్రాఫిక్!
Wanaparthy: వనపర్తి జిల్లా ఆత్మకూరులో వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు ధర్నాకు దిగారు.
Wanaparthy: వరి ధాన్యం కొనాలని రైతుల ఆందోళన.. స్తంభించిన ట్రాఫిక్!
Wanaparthy: వనపర్తి జిల్లా ఆత్మకూర్ గాంధీ చౌక్ లో వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. మండలంలోని జూరాల గ్రామానికి చెందిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సకాలంలో కొనుగోలు చేయడం లేదని, కాంటాలు పూర్తయిన వడ్లు లారీలో రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్తే అన్లోడ్ చేయడం లేదని ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో గన్ని బ్యాగ్స్ కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నామని వాపోయారు. అకాలవర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నా అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవడం లేదని,
ఎలాంటి తరుగు లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా లు చేస్తూ నిరసన తెలిపారు. ఎస్సై జయన్న వచ్చి ధర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నించగా కలెక్టర్ గాని స్థానిక ఎమ్మార్వో గాని వచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకుకూర్చోవడంతో చౌరస్తా నాలుగు వైపులా వాహనాలు నిలిచిపోయి ట్రా ఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎమ్మార్వో జెకె మోహన్ వచ్చి రైతులను శాంతపరిచి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.




